ఆ మ్యాచ్ తర్వాత కపిల్ దేవ్ రిటైర్ అవుతాడనుకున్నాం!... కానీ ఆయనేమో షాక్ ఇచ్చాడు...

First Published Sep 20, 2022, 12:11 PM IST

టాలీవుడ్ నాటి తరం నటుడు శోభన్ బాబు చెప్పినట్టు ‘పరుగు ఆపడం ఓ కళే’. ఎప్పుడు మొదలెట్టాలో తెలియడమే కాదు ఎక్కడ ఎప్పుడు ఆపాలో కూడా తెలియడం చాలా అవసరం. ఇది తెలియకనే క్రికెట్‌లో లెజెండ్స్‌గా పేరొందిన కొందరు, ‘వీడు ఎప్పుడు రిటైర్ అవుతాడ్రా బాబు’ అని అభిమానుల చేతే విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో కపిల్ దేవ్ ముందువరుసలో ఉంటాడు...

Image credit: Getty

1978లో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన కపిల్ దేవ్, కెప్టెన్‌గా 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచాడు. భారత క్రికెట్ దశను మార్చిన 1983 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత కపిల్ దేవ్ స్టార్‌గా మారిపోయాడు...

131 టెస్టులు, 225 వన్డేలు ఆడిన కపిల్‌ దేవ్, రికార్డు స్థాయిలో టెస్టుల్లో 434 వికెట్లు, వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన కపిల్ దేవ్, టెస్టుల్లో 5248, వన్డేల్లో 3783 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు కూడా ఉన్నాయి..

1990ల్లో కపిల్ దేవ్ రిటైర్మెంట్ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. కెరీర్ చరమాంకంలో 1991లో రిటైర్ అయిన రిచర్డ్ హార్డ్‌లీ 431 టెస్టు వికెట్ల రికార్డును అందుకోవాలనే ఉద్దేశంతోనే క్రికెట్‌లో కొనసాగుతూ వచ్చాడు కపిల్ దేవ్...

1991-92 ఆస్ట్రేలియా పర్యటనలో 400 వికెట్లు పూర్తి చేసుకున్న కపిల్ దేవ్, ఆ తర్వాత 31 వికెట్లు పడగొట్టేందుకు దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నాడు. చివరికి అహ్మదాబాద్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హషాన్ తిలకరత్నేని అవుట్ చేసి, రిచర్డ్ హార్డ్‌లీ రికార్డును బ్రేక్ చేశాడు కపిల్ దేవ్...

ఈ రికార్డు బ్రేక్ చేసిన తర్వాత కపిల్ దేవ్ రిటైర్మెంట్ తీసుకుంటాడని అనుకున్నారు చాలామంది. అయితే అప్పటికి కూడా కపిల్ దేవ్ దాహం తీరలేదు. టీమిండియా మాజీ ఓపెనర్, అప్పటి బీసీసీఐ సెలక్టర్ అన్షుమాన్ గైక్వాడ్, కపిల్ దేవ్ రిటైర్మెంట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు తీశాడు.

‘కపిల్ దేవ్ లాంటి పెద్ద ప్లేయర్‌ని డ్రాప్ చేయలేం. టీమిండియాకి ఎంతో సేవ చేసిన కపిల్ దేవ్‌కి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన్ని ప్రతీ సిరీస్‌కి ఎంపిక చేస్తూ వచ్చాం. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో రిచర్డ్ హార్డ్‌లీ రికార్డు బ్రేక్ చేశారు కపిల్ దేవ్. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటన చేస్తారని అనుకున్నాం...

అయితే ఆ సాయంత్రం ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో ఆయన మాకు షాక్ ఇచ్చారు. తాను మరో రెండున్నరేళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతానని చెప్పారు. ఆ తర్వాత రోజు అప్పటి చీఫ్ సెలక్టర్ గుండప్ప విశ్వనాథ్, నన్ను పిలిచి... ‘‘ఈరోజు న్యూస్ పేపర్స్ హెడ్‌లైన్స్ చూశావా... కపిల్ దేవ్ మరో రెండున్నరేళ్లు ఆడతాడట’’ అని అడిగారు... ఆ రోజు సాయంత్రమే సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని డిసైడ్ అయ్యాం...

బీసీసీఐ సెక్రటరీ జగన్మోహన్ దాల్మియాతో మీటింగ్‌లో కపిల్ దేవ్‌ని తప్పించాల్సిన సమయం వచ్చిందని నిర్ణయం తీసుకున్నాం. కపిల్‌తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుందామని నేను అన్నాను. టీ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కపిల్‌ని కలిశాం...

గుండప్ప విశ్వనాథ్ చాలా ముక్కుసూటి మనిషి కాదు. కుండబద్ధలు కొట్టినట్టు ఏమున్నా ముఖం మీదే చెబితే ఎదుటివాళ్లు ఫీల్ అవుతారని అనుకునేవాడు. అందుకే ఏదైనా చెప్పాలంటే అది, ఇది... అంటూ సుట్టూ తిరిగి చెప్పేవాడు. కాబట్టి నేను కపిల్‌కి విషయం చెప్పాలనుకున్నా...

గుండప్ప విశ్వనాథ్‌కి మొహమాటం ఎక్కువ. కుండబద్ధలు కొట్టినట్టు ఏమున్నా ముఖం మీదే చెబితే ఎదుటివాళ్లు ఫీల్ అవుతారని అనుకునేవాడు. అందుకే ఏదైనా చెప్పాలంటే అది, ఇది... అంటూ సుట్టూ తిరిగి చెప్పేవాడు. కాబట్టి నేను కపిల్‌కి విషయం చెప్పాలనుకున్నా...

1994లోనూ కపిల్‌ దేవ్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అయితే ఆయన బౌలింగ్‌లో పేస్ తగ్గింది, ఆరంభంలో రాబట్టిన స్వింగ్ రాబట్టలేకపోయారు. బ్యాటింగ్‌లోనూ పదును తగ్గింది. ఎంతో సక్సెస్‌ఫుల్‌గా సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన ఆయన, కెరీర్ ఎండింగ్‌లో ఇలా ఇబ్బంది పడడం అభిమానులు కూడా చూడలేకపోయారు...

నేను కపిల్‌కి సూటిగా విషయం చెప్పాను. సెలక్టర్లు మిమ్మల్ని తప్పించాలని చూస్తున్నారు. ఎందుకో నీకు కూడా తెలుసు. నీకోసం మేం ఓ ఫేర్‌వెల్ మ్యాచ్ ఇస్తాం. ఎప్పుడు, ఎక్కడ ఆడాలనేది నీ ఇష్టం. ఆ రోజు నువ్వు రిటైర్మెంట్ తీసుకోవచ్చని చెప్పాను...

నా మాటలకు కపిల్ దేవ్ చాలా చక్కగా స్పందించాడు. ‘థ్యాంక్యూ సో మచ్... నువ్వు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. నాకు సమయం వచ్చిందని అర్థమైంది...’ అన్నారు కపిల్...’  అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ ఓపెనర్, అప్పటి బీసీసీఐ సెలక్టర్ అన్షుమాన్ గైక్వాడ్. 

click me!