అవన్నీ ఉట్టి వార్తలే! ఆరు నెలల్లో రిషబ్ పంత్ రీఎంట్రీ.. మరో రెండు నెలల్లో...

First Published Jan 18, 2023, 1:28 PM IST

స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలోనే కారు ప్రమాదానికి గురయ్యాడు రిషబ్ పంత్. బ్రిస్బేన్ టెస్టు విజయం తర్వాత టీమిండియాకి మ్యాచ్ విన్నర్‌గా, మూడు ఫార్మాట్లలో వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న రిషబ్ పంత్... రీఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు? ఇప్పుడు ఆయన అభిమానులను వెంటాడుతున్న ప్రశ్న ఇదే...
 

Rishabh Pant

రిషబ్ పంత్ కోలుకోవడానికి ఏడాది సమయం పడుతుందని కొందరు, లేదు కనీసం 18 నెలల వరకూ అతను ఆడడం కుదరదని మరికొందరు కామెంట్లు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ సోషల్ మీడియాలో రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి పూటకో వార్త పుట్టుకొస్తూనే ఉంది...

డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్, 18 రోజుల తర్వాత జనవరి 16న సోషల్ మీడియా ద్వారా తన క్షేమ సమాచారాన్ని తెలియచేశాడు. రిషబ్ పంత్‌కి చేసిన మూడు సర్జరీలు విజయవంతమైనట్టు ఆసుపత్రి వర్గాలు తెలియచేశాయి... 

Rishabh Pant-Pujara

అయితే రిషబ్ పంత్ మరో రెండు వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండబోతున్నాడు. వారం తర్వాత డిశార్జి చేస్తామని వైద్యులు సూచించినా, ముంబై నుంచి ఢిల్లీకి తరలించడం రిస్క్ అని భావించిన బీసీసీఐ మరో వారం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉంచుకోవాల్సిందిగా కోరిందట...

rishabh pant

ఆసుపత్రి నుంచి డిశార్చి అయిన తర్వాత రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోబోతున్నాడు రిషబ్ పంత్. గాయాలు పూర్తిగా మానిన తర్వాత రిషబ్ పంత్, క్రికెట్ ప్రాక్టీస్ మొదలెడతాడని సమాచారం. అంటే మరో ఆరు నెలల్లో రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంచనా వేస్తున్నారు వైద్యులు...

Rishabh Pant

అయితే రెండు నెలల తర్వాత రిషబ్ పంత్ శరీరం, ప్రాక్టీస్‌కి సహకరించే విధానాన్ని బట్టి అతను పూర్తిగా కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చనే విషయంలో ఓ అంచనా వస్తుందని తెలియచేశారు వైద్యులు.

Image credit: Getty

అయితే అసలు రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అని భయపడుతున్న రిషబ్ పంత్ అభిమానులకు ఇది కాస్త సంతోషాన్ని కలిగించే విషయమే... ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు ఈ ఏడాది జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు రిషబ్ పంత్ దూరమైనట్టే.. 

click me!