రిటైర్ అయ్యాక కూడా మాకు నచ్చిన టోర్నీల్లో ఆడొద్దంటే ఎలా? ఇది అన్యాయం... బీసీసీఐపై రాబిన్ ఊతప్ప ఫైర్...

Published : Aug 10, 2023, 01:01 PM IST

పాక్ క్రికెటర్లు, ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్, సౌతాఫ్రికా20, బిగ్‌బాష్ లీగ్, ది హాండ్రెడ్.. ఇలా ఏ దేశానికి చెందిన క్రికెటర్లు అయినా విదేశీ లీగుల్లో ఆడడానికి అనుమతి ఉంది. ఒక్క భారత క్రికెటర్లకు తప్ప. భారత క్రికెటర్లు, ఐపీఎల్ తప్ప విదేశీ లీగుల్లో ఆడడానికి వీల్లేదు. అలా ఆడితే భారత జట్టు తరుపున, ఐపీఎల్ ఆడే అవకాశం ఉండదు..

PREV
17
రిటైర్ అయ్యాక కూడా మాకు నచ్చిన టోర్నీల్లో ఆడొద్దంటే ఎలా? ఇది అన్యాయం... బీసీసీఐపై రాబిన్ ఊతప్ప ఫైర్...
Robin Uthappa

భారత దేశవాళీ టోర్నీలను కాపాడేందుకు, అలాగే ఐపీఎల్ క్రేజ్ తగ్గకుండా చూసుకునేందుకు వీలుగా భారత క్రికెటర్లు, విదేశీ లీగుల్లో పాల్గొనకూడదనే రూల్‌ని ప్రవేశపెట్టింది బీసీసీఐ. భారత క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన క్రికెటర్లు మాత్రం విదేశీ లీగుల్లో పాల్గొంటున్నారు..

27

అయితే విదేశీ లీగుల్లో పాల్గొనాలనే ఉద్దేశంలో చాలామంది క్రికెటర్లు 33-34 ఏళ్ల వయసుకే భారత క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇస్తున్నారు. ఈ విధమైన ముందస్తు రిటైర్మెంట్లను తగ్గించేందుకు బీసీసీఐ ఓ కొత్త మార్గదర్శకాలను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది..
 

37

రిటైర్మెంట్ తర్వాత కూడా భారత ప్లేయర్లు, విదేశీ లీగుల్లో ఆడకుండా చట్టం తీసుకొచ్చేందుకు బీసీసీఐ ఆలోచనలు చేస్తోంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తీవ్రంగా స్పందించాడు..
 

47

‘రిటైర్మెంట్ తర్వాత కూడా ఇది చేయొద్దు, అందులో ఆడొద్దు అనడం కరెక్ట్ కాదు. ఇది మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. బీసీసీఐ నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్ లేనప్పుడు, ఇండియాకి క్రికెట్ ఆడనప్పుడు మేం ఎక్కడ ఆడితే మీకెందుకు? ఇలాంటి చర్యలు, మా సౌకర్యాన్ని, స్వేచ్ఛని దెబ్బ తీస్తాయి..

57
Robin Uthappa

బీసీసీఐ, ఇలాంటి పాలసీని తెచ్చేందుకు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటుందనే అనుకుంటున్నా. నాకు తెలిసి బీసీసీఐ తీసుకునే నిర్ణయం, ఐపీఎల్ ఆడాలనుకునే ప్లేయర్లకు మాత్రమే వర్తిస్తుంది. చిన్న వయసులోనే రిటైర్ అవుతున్న ప్లేయర్ల సంఖ్యను తగ్గించాలంటే వారికి అవకాశాలు కల్పించాలి..

67

ఐపీఎల్‌లో ఎంతమంది భారత క్రికెటర్లకు అవకాశం దక్కుతోంది. దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించే చాలామంది ప్లేయర్లు, ఐపీఎల్‌లో అమ్ముడు కూడా పోవడం లేదు. అవకాశాలు వెతుక్కుంటూ వాళ్లు బయటికి వెళ్లడంలో తప్పేముంది..’ అంటూ కామెంట్ చేశాడు రాబిన్ ఊతప్ప.. 

77
Robin Uthappa

భారత క్రికెట్ బోర్డుకి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, మురళీ విజయ్ వంటి ప్లేయర్లు, ప్రస్తుతం జింబాబ్వే టీ10 లీగ్‌లో ఆడుతున్నారు. యూఏఈలో జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20లోనూ ఆడాడు రాబిన్ ఊతప్ప.. 

click me!

Recommended Stories