గత ఐదేళ్లల్లో రూ.4298 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన బీసీసీఐ... ఆర్థిక శాఖ మంత్రి వెల్లడి..

Published : Aug 10, 2023, 12:15 PM IST

వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ, గత ఐదేళ్లల్లో భారత ప్రభుత్వానికి రూ.4298 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించినట్టు, ఆర్ధిక శాఖ వెల్లడించింది. వాస్తవానికి ఐపీఎల్‌ ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. అయినా భారీ మొత్తంలో పన్ను చెల్లించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి తెలియచేశారు..  

PREV
16
గత ఐదేళ్లల్లో రూ.4298 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన బీసీసీఐ... ఆర్థిక శాఖ మంత్రి వెల్లడి..

రాజ్యసభలో జరిగిన చర్చలో బీసీసీఐ, గత ఐదేళ్లలో రూ.4298.12 కోట్ల మొత్తాన్ని ఆదాయపు పన్ను రూపంలో చెల్లించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి తెలియచేశారు. 

26

2020-21 ఏడాదిలో రూ.844.92 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.882.29 కోట్లు, 2018-19 ఏడాదిలో రూ.815.08 కోట్లు, 2017-18 ఏడాదికి రూ.596.63 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించింది బీసీసీఐ..
 

36

2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏకంగా రూ.1159.20 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. 2017-18 ఏడాదిలో బీసీసీఐ చెల్లించిన పన్ను మొత్తంతో పోలిస్తే 2021-22 ఏడాదిలో చెల్లించిన పన్ను రెట్టింపు కావడం విశేషం..

46

పార్లమెంట్ సభ్యులు అనిల్ దేశాయ్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, భారత ప్రభుత్వానికి ఆదాయపన్ను చెల్లిస్తుందా? లేదా? అనే విషయానికి తెలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాడు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి, ఈ పన్ను వివరాలను తెలియచేశారు..

56

అంతేకాకుండా గత ఐదేళ్లలో బీసీసీఐ మిగులు లెక్కలను కూడా సభకు తెలియచేశారు ఆర్థిక మంత్రి. 2019-2020లో బీసీసీఐ ఖాతాలో రూ.1650 కోట్ల మిగులు ఉండగా, 2020-21 ఆర్థిక సంవతర్సరంలో అది రూ.2700 కోట్లకు చేరింది. 2021-21 ఏడాదిలో భారత క్రికెట్ బోర్డు మిగులు రూ.4542 కోట్లుగా ఉందని తెలియచేశారు కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి..  
 

66

ఐపీఎల్‌ ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. కేవలం మీడియా హక్కుల విక్రయం ద్వారానే రూ.48 వేల కోట్లు ఆర్జించింది బీసీసీఐ. కేవలం భారత క్రికెట్ టీమ్ ద్వారా వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోగా వేల కోట్ల రూపాయలు మిగులు ఉంటోందని కేంద్రం తెలియచేసింది..

click me!

Recommended Stories