ఆ ఇద్దరూ అందుకే ఆడలేదు... కౌంటీతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీనియర్లపై క్లారిటీ...

First Published Jul 20, 2021, 7:51 PM IST

కౌంటీ సెలక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ, ఉప సారథి అజింకా రహానే, అశ్విన్ వంటి కీలక ప్లేయర్లు ఆడకపోవడంపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. దీంతో వీళ్లు ఆడకపోవడానికి బీసీసీఐ స్వయంగా క్లారిటీ ఇచ్చింది...

వాస్తవానికి భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేవు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ రిజల్ట్ తర్వాత బీసీసీఐ పావులు కదపాల్సి వచ్చింది.
undefined
కీలక మ్యాచుల ముందు ప్రాక్టీస్ మ్యాచులు అవసరమని భావించిన బీసీసీఐ సెక్రటరీ జై షా, ఇంగ్లాండ్ బోర్డుతో చర్చలు జరిపి కౌంటీతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఏర్పాటు చేయించాడు.
undefined
అంత కష్టపడి ఏర్పాటుచేసిన మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో భారత కీలక ప్లేయర్లు అజింకా రహానే, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ పాల్గొనకపోవడంపై తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది...
undefined
అయితే వీళ్లు ఆడకపోవడానికి గట్టి కారణాలు ఉన్నాయట. సోమవారం సాయంత్రం విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బాధపడ్డాడు. వైద్యులు కాస్త విశ్రాంతి అవసరమని సూచించడం వల్ల వార్మప్ మ్యాచ్ నుంచి దూరంగా ఉన్నాడు...
undefined
అలాగే అజింకా రహానే తొడ కండరాల్లో వాపు రావడంతో అతనికి కూడా విశ్రాంతి అవసరమని సూచించారు ఫిజియో. ఈ కారణంగా భారత టెస్టు వైస్ కెప్టెన్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌కి దూరమయ్యాడు...
undefined
ప్రాక్టీస్ మ్యాచ్‌కి ముందు సుర్రే క్లబ్ తరుపున కౌంటీ మ్యాచ్ ఆడాడు రవిచంద్రన్ అశ్విన్. కాబట్టి తన స్థానంలో మరో ప్లేయర్‌కి ప్రాక్టీస్‌గా ఈ మ్యాచ్ ఉపయోగపడుతుందని భావించి, అతను ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు...
undefined
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడిన ఇషాంత్ శర్మ, ఇంకా ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. బౌలింగ్ హ్యాండ్‌ వేళ్లకు గాయం కావడంతో అతను విశ్రాంతి తీసుకున్నాడు...
undefined
ఇదిలా ఉండగా వార్మప్ మ్యాచ్‌లో కౌంటీ ఎలెవన్ జట్టు తరుపున ఆడిన భారత బౌలర్ ఆవేశ్ ఖాన్ గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్నసమయంలో వేగంగా వచ్చిన బంతిని ఆపబోయిన ఆవేశ్ ఖాన్ వేలికి గాయమై రక్తస్రావమైంది...
undefined
మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 9, మయాంక్ అగర్వాల్ 28, ఛతేశ్వర్ పూజారా 21, హనుమ విహారి 24 పరుగులు చేసి నిరాశపరచగా... కెఎల్ రాహుల్ 70 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
undefined
click me!