రవిశాస్త్రి ఉన్నాడుగా, ఇక రాహుల్ ద్రావిడ్‌ను కోచ్ చేయడం ఎందుకు... మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్

First Published Jul 19, 2021, 3:46 PM IST

శ్రీలంక టూర్‌కి రాహుల్ ద్రావిడ్‌ని కోచ్‌గా ఎంపిక చేయడం, ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న హెడ్ కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ టీ20 వరల్డ్‌కప్ తర్వాత ముగియనుండడంతో భారత జట్టు తర్వాత కోచ్ ఎవరనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రవిశాస్త్రి తర్వాత ఆ బాధ్యతలు రాహుల్ ద్రావిడ్‌కి దక్కబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి...

నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్, భారత జట్టులోని చాలామంది యువకులు, టీమ్‌లోకి రావడానికి మార్గనిర్దేశకుడిగా వ్యవహారించాడు...
undefined
నవ్‌దీప్ సైనీ నుంచి సిరాజ్, శార్దూల్, నటరాజన్, పృథ్వీషా, శుబ్‌మన్ గిల్... ఇలా రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో రాటుతేలి, టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లు ఎందరో...
undefined

Latest Videos


‘రాహుల్ ద్రావిడ్ ఇప్పటికే కోచ్‌ని తనని తాను నిరూపించుకున్నాడు. కొన్నేళ్లుగా అండర్19, ఇండియా ఏ జట్లకు కోచ్‌గా అద్భుతమైన సేవలు అందించారు...
undefined
రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా రావాలనుకుంటే, ఆయనకి ఆడిషన్స్, ఇంటర్వ్యూలు అవసరమై లేదు. అయితే రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా బాగానే ఆడుతోంది...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మినహా ఇస్తే, రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియాకి పెద్ద నష్టమేమీ జరగలేదు.
undefined
రవిశాస్త్రి, టీమిండియా కోచ్‌గా ఉన్న సమయంలో రాహుల్ ద్రావిడ్ అండర్ 19 టీమ్‌ నుంచి ఎందరో కుర్రాళ్లు జట్టులోకి వచ్చారు... నాకు తెలిసి ఇప్పుడు కోచ్‌ను మార్చాల్సిన అవసరమైతే లేదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్...
undefined
అయితే రాహుల్ ద్రావిడ్ భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపించకపోవచ్చని మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్ చేశాడు...
undefined
‘రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు తనకున్న బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నారు. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఆయన సంతృప్తి చెందుతున్నారు. కాబట్టి భారత హెడ్‌కోచ్ పదవికి ఆయన పోటీ చేస్తారని అనుకోను’ అంటూ కామెంట్ చేశాడు మంజ్రేకర్.
undefined
click me!