విరాట్ కోహ్లీ ఎక్కువ కాలం ఆడాలంటే, రహానేని టెస్టు కెప్టెన్‌గా చేయాలి... బిషన్ సింగ్ బేడీ...

First Published Jan 23, 2021, 11:26 AM IST

ఆడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చి, ఏకంగా సిరీస్ సొంతం చేసుకుంది టీమిండియా. తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే కెప్టెన్సీలో భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యపర్చింది. దాంతో టెస్టు కెప్టెన్సీని అతనికి ఇచ్చేయాలని కోహ్లీకి సూచించారు భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ.

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రెండు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన అజింకా రహానే... రెండింట్లోనూ విజయాలను అందించాడు...
undefined
అయితే ఆడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత భారత జట్టును నడిపించడం అంత తేలిక కాదని, రహానే ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా ఫెయిల్ అవుతాడని భావించారంతా...
undefined
అయితే వారందరికీ తన అద్భుతమైన నాయకత్వ విధానంతోనే సమాధానం ఇచ్చాడు అజింకా రహానే. ఆడిలైడ్ పరాజయం తర్వాత రహానే కెప్టెన్సీలో అద్భుతమే చేసింది టీమిండియా...
undefined
గబ్బా టెస్టులో సీనియర్లు లేకుండా యువకులతో అజింకా రహానే అండ్ టీమ్ సాధించిన విజయం అద్వితీయం...
undefined
‘ఆసీస్ టూర్‌లో భారత జట్టు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే వాటన్నింటినీ అధిగమించి, భారత జట్టు సాధించిన విజయం అపూర్వం...
undefined
తన దగ్గరున్న అతి తక్కువ వనరులను అద్భుతంగా ఎలా వాడుకోవాలో చేసి చూపించాడు అజింకా రహానే... ఆస్ట్రేలియా పర్యటనలో రహానే, భారత మాజీ కెప్టెన్ టైగర్ పటౌడీలా అనిపించాడు.
undefined
కొత్త కుర్రాళ్లతో భారత జట్టు అద్భుతమై చేసింది... ఈ టూర్‌లో రహానే కెప్టెన్సీకి చాలా దగ్గరగా గమనించాను. ఏ కెప్టెన్ నాయకత్వమైనా అతను బౌలింగ్ విభాగాన్ని ఎలా వాడుకుంటున్నాడనే దానిపైనే ఆధారపడి ఉంటుంది..
undefined
ఆ విషయంలో రహానే ఓ మేజిషయన్‌లా వ్యవహారించాడు. ఆసీస్ టూర్‌లో జరిగిన మూడు టెస్టులు, రహానే బౌలర్లను ఎలా వాడుకుంటాడో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ...
undefined
రహానే చేసిన మార్పుల్లో ఒక్కటైనా తప్పుగా ఉంటుందని వెతికి చూశాను. కానీ ప్రశ్నించడానికి వీలు లేకుండా పర్ఫెక్ట్ మార్పులతో కెప్టెన్సీ చేశాడు రహానే...
undefined
కెప్టెన్సీలో 90 శాతం లక్, 10 శాతం స్కిల్ అవసరమని ది గ్రేట్ రిచీ బినాడ్ అన్నారు. అయితే 10 శాతం స్కిల్ లేకపోతే, 90 శాతం లక్ ఉన్నా వృథా... రహానే దగ్గర రెండూ ఉన్నాయి.కాకపోతే రహానేలో 50 శాతం లక్, 50 శాతం స్కిల్ ఉన్నాయి...
undefined
కోహ్లీ కెప్టెన్సీని తప్పుబట్టడనికి లేదు. కానీ అతనిపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. బ్యాట్స్‌మెన ఎక్కువకాలం కొనసాగాలనుకుంటే, టెస్టు కెప్టెన్సీని రహానేకి ఇస్తే మంచిది...
undefined
ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఈ నిర్ణయాన్ని తీసుకుంటాడని అనుకుంటున్నా... ’ అని చెప్పుకొచ్చాడు బిషన్ సింగ్ బేడీ...
undefined
అయితే విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా తొలగిస్తే, భారత జట్టు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని... ఇది టీమిండియా కల్చర్‌నే దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.
undefined
click me!