టీమిండియా కమ్‌బ్యాక్ పర్ఫామెన్స్ WWE స్క్రిప్ట్‌లా అనిపించింది... WWE స్టార్ త్రిబుల్ హెచ్...

First Published | Jan 23, 2021, 10:19 AM IST

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లకు ఇక్కడ ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ‘ది రాక్’ డ్వేన్ జోన్స్, త్రిబుల్ హెచ్, అండర్ టేకర్‌ లాంటి ఎందరో స్టార్లకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ స్టార్లు క్రికెట్ చూస్తారా? ఇంతకుముందైతే ఏమో కానీ ఇప్పుడు మాత్రం భారత క్రికెట్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ వచ్చింది. తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, రెజ్లర్ త్రిబుల్ హెచ్, తాను టీమిండియా ఆటకు ఫ్యాన్ అయ్యానంటూ స్వయంగా ప్రకటించాడు.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌ను రెగ్యూలర్‌గా ఫాలో అయ్యాడట డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ త్రిబుల్ హెచ్...
‘నేను ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌ను రెగ్యూలర్‌గా ఫాలో అయ్యాను. అయితే టైం డిఫెరెన్స్ కారణంగా సమయానికి చూడలేకపోయాను...

పడిన తర్వాత లేవడం చాలా కష్టం. డబ్ల్యూడబ్ల్యూఈలో స్క్రిప్టు లెవెల్‌లో రెజ్లర్లు ఇలా లేచి పోరాడుతారు... కానీ టీమిండియా ఆటతీరు చూసి ఆశ్చర్యమేసింది...
మొదటి టెస్టు ఓటమి తర్వాత భారత జట్టు ఇచ్చిన కమ్‌బ్యాక్ నిజంగా అద్భుతం... జట్టులో ఉన్న ప్రతి ఒక్కరినీ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది...
నాకు తెలుసు, భారత దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ ఇప్పటికీ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు...
నేను భారత జట్టును పర్సనల్‌గా ఇక్కడికి ఆహ్వానించాలని అనుకుంటున్నాను... రండి, మా సూపర్‌స్టార్ స్పెటాకల్‌లో భాగమై, మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి...
మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను... కంగ్రాట్స్ టీమిండియా...’ అంటూ చెప్పుకొచ్చాడు త్రిబుల్ హెచ్.
ఈ అమెరికన్ ప్రొఫెషనల్ స్టార్ రెజ్లర్ అసలు పేరు పాల్ మైఖేల్ లెవెస్కీ... అయితే రింగ్ నేమ్ ‘త్రిబుల్ హెచ్’తోనే బాగా పాపులర్ అయ్యాడు...
డబ్ల్యూడబ్ల్యూఈలో ఆల్‌టైం గ్రేటెస్ట్ రెజ్లర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన త్రిబుల్ హెచ్.. హోస్ట్‌గానూ, నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Latest Videos

click me!