ధోనీ రిటైర్ అయితే కెప్టెన్సీ అతనికే... సురేశ్ రైనాకి ఛాన్స్ లేదు... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్...

First Published Apr 22, 2021, 5:31 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. దాదాపు 40 ఏళ్లకు చేరువైన ధోనీ, ఈ వయసులో భారీ షాట్లు ఆడలేనని కూడా తేల్చేశాడు. దీంతో మాహీ, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి...

ఐపీఎల్ 2020 సీజన్‌లో నిరాశజనితమైన ప్రదర్శన ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. దీంతో ఈసారి టైటిల్ గెలిచి, లేదా కనీసం ఫైనల్‌కి అర్హత సాధించాలనే కసి, సీఎస్‌కే ఆటగాళ్లలో కనిపిస్తోంది...
undefined
‘ఇప్పుడు ఎమ్మెస్ ధోనీ ఆటతీరు చూస్తుంటే, అతను త్వరలో ఐపీఎల్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నాకు అనిపిస్తోంది. మహా అయితే రెండేళ్లు ధోనీ ఆడొచ్చు. అది కూడా అభిమానులు కోరుకుంటేనే...
undefined
చెన్నై సూపర్ కింగ్స్‌కి మహేంద్ర సింగ్ ధోనీ చాలా కీలకమైన ప్లేయర్. మాహీ లేకపోతే సీఎస్‌కే పరిస్థితి ఏంటి? అని ఇప్పటికే చెన్నై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు కూడా...
undefined
సురేశ్ రైనాకి సీఎస్‌కే కెప్టెన్సీ దక్కుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే సీనియర్ ప్లేయర్ అయిన రైనాకి కెప్టెన్సీ ఇస్తే, మళ్లీ రెండు, మూడేళ్లకు కొత్త కెప్టెన్ గురించి వెతుక్కోవాల్సి ఉంటుంది...
undefined
ఎలా చూసినా చెన్నై సూపర్ కింగ్స్‌ను నడిపించగల సత్తా ఉన్న ప్లేయర్ రవీంద్ర జడేజానే. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్... ఇలా అన్ని విభాగాల్లో పట్టు ఉన్న జడ్డూ, సీఎస్‌కేని ముందుండి నడిపించగలడు...’ అంటూ వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్...
undefined
2021 సీజన్‌లో మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్న రవీంద్ర జడేజా... రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడమే కాకుండా... నాలుగు క్యాచులు అందుకున్నాడు.
undefined
చెన్నై సూపర్ కింగ్స్‌లో ప్రస్తుతం ఉన్న ప్లేయర్లలో ధోనీ రిటైర్మెంట్ తర్వాత డుప్లిసిస్‌కి కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది...
undefined
అయితే సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఘోరంగా విఫలమైన డుప్లిసిస్, ఐపీఎల్‌లో ఘనమైన చరిత్ర ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎలా నడిపించగలడని కామెంట్లు చేస్తున్నవారూ ఉన్నారు...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడినా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన సీఎస్‌కే... పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది...
undefined
click me!