ఈ మ్యాచ్ లో అయినా విజృంభిస్తాడని అనుకున్నాం.. కానీ.. కోహ్లి పై ఆర్సీబీ కెప్టెన్, డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

First Published May 14, 2022, 1:06 PM IST

IPL 2022: వరుస వైఫల్యాలతో ముప్పేట విమర్శల దాడిని ఎదుర్కుంటున్న విరాట్ కోహ్లి  శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అయినా రాణిస్తాడనుకుంటే.. అక్కడా విఫలమయ్యాడు. కోహ్లి వైఫల్యాలపై ఆర్సీబీ టీమ్ డైరెక్టర్, కెప్టెన్  లు షాకింగ్  కామెంట్స్ చేశారు. 

వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడా..? అనిపిస్తున్న విరాట్ కోహ్లి ఆటతీరుపై ఆ జట్టు కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్, టీమ్ డైరెక్టర్ మైక్ హెస్సన్  స్పందించారు. ఈ మ్యాచ్ లో కోహ్లి రాణిస్తాడని అనుకున్నామని కానీ అదృష్టం అతడివైపు లేదని  వ్యాఖ్యానించారు. 

పంజాబ్ తో మ్యాచ్ అనంతరం ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘కోహ్లి కోసం ఓ మంచి ఇన్నింగ్స్ ఎదురుచూస్తున్నది.  అతడు కూడా అదే నమ్ముతున్నాడు.  అతడు తన కెరీర్ లోనే అత్యంత హీన దశ ఎదుర్కుంటున్న మాట నిజమే. 

కొద్దిరోజులుగా కోహ్లి చాలా తేలికైన ఆటను ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ అన్ని మార్గాలు అతడు ఔట్ కావడానికే అన్నట్టు గట్టిగా అతడి మీదకు  దాడి చేస్తున్నాయి. అయితే ఒక ఆటలో ఇలా జరగడం సహజమే. 

దానికి మనం చేయాల్సిందల్లా.. కష్టపడి ప్రయత్నిస్తూనే ఉండటం..  సానుకూల దృక్పథంతో ముందుకు కదలడం.. నేటి మ్యాచ్ లో కూడా కోహ్లి కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. కచ్చితంగా అతడు దానిని కొనసాగించాలని చూస్తున్నాడు.. అతడికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..’ అని అన్నాడు. 

ఇక కోహ్లి ఫామ్ పై మైక్ హెస్సన్ మాట్లాడుతూ.. ‘మేము ఎల్లప్పుడూ మా జట్టు ఆటగాళ్లందరితో మాట్లాడుతున్నాము. విరాట్ ఈరోజు మ్యాచ్ లో క్రీజులోకి వెళ్లినప్పుడు మంచి టచ్ లో కనిపించాడు. దూకుడుగా ఆడాడు. మ్యాచ్ కు ముందు గ్రౌండ్ లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఈ రోజు అతడితే అనుకున్నాను. కానీ మరోసారి అతడి అదృష్టం కలిసిరాలేదు. ఒకవేళ కోహ్లి తనను తాను భాగా ఆడాలని సెట్ చేసుకున్నప్పుడు ఔట్ అయితే అందరిలాగే తాను కూడా ఫ్రస్టేట్ అవుతాడు. 

ఇప్పటికీ ఆర్సీబీలో విరాట్ గొప్ప బ్యాటర్. అతడు అద్భుత ఆటగాడు. ఈ సీజన్ లో అతడు మేము అనుకున్నంతగా రాణించడం లేదు. మునపటి ఫామ్ ను అందుకోవడానికి కోహ్లి బాగా కష్టపడుతున్నాడు.  అయితే వీటిపై మేము అతడిపై పెద్దగా ఒత్తిడి తేదలుచుకోలేదు.  కోహ్లి త్వరలోనే ఫామ్ ను అందుకుంటాడు..’ అని తెలిపాడు.

ఇక ఈ సీజన్ లో 13 మ్యాచులాడిన కోహ్లి.. 19.67 సగటుతో 236 పరుగులు చేశఆడు. అందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 14 బంతుల్లోనే 2 బౌండరీలు, 1 సిక్సర్ తో 20 పరుగులు చేసిన కోహ్లి.. రబాడా బౌలింగ్ లో రాహుల్ చాహర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

click me!