‘రైనా, నీ టీమ్ ఇలా ఆడుతోందేంటి?’.. ‘సారీ బ్రో! నేను లేను టీమ్‌లో’.. యువరాజ్ సింగ్, సురేష్ రైనా మధ్య...

First Published May 13, 2022, 7:57 PM IST

సొంత జట్టు విజయాలు సాధిస్తుంటే వచ్చే ఆనందం కంటే, మనల్ని వద్దని వదిలేసిన టీమ్ ఓడిపోతుంటే కలిగే కిక్ వేరే రేంజ్‌లో ఉంటుంది. జెంటిల్మెన్ క్రికెట్‌లోనూ ఇది సహజం. ప్రస్తుతం ఈ రకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు సీఎస్‌కే మాజీ ప్లేయర్ సురేష్ రైనా...

ఐపీఎల్ కెరీర్‌లో 5500లకు పైగా పరుగులు చేసి, చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సురేష్ రైనా. భారత జట్టుకి ఆడిన దాని కంటే ఐపీఎల్‌లో సీఎస్‌కే తరుపున సూపర్‌గా ఆడి ‘మిస్టర్ ఐపీఎల్’ అనే పేరు తెచ్చుకున్నాడు...

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో సురేష్ రైనా పర్ఫామెన్స్ పెద్దగా మెప్పించకపోవడం, షార్ట్ బాల్స్ ఆడేందుకు ‘చిన్నతలా’ తెగ ఇబ్బందిపడుతుండడంతో... అతన్ని రిటైన్ చేసుకోవడానికి ఇష్టపడలేదు చెన్నై సూపర్ కింగ్స్... 

Latest Videos


రిటెన్షన్‌లో చోటు దక్కకపోయినా సురేష్ రైనాని మెగా వేలంలో సీఎస్‌కే తిరిగి కొనుగోలు చేస్తుందని అనుకున్నారంతా. అయితే ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో రైనా కూడా చేరాల్సి వచ్చింది...

సురేష్ రైనా లేకుండా తొలిసారి 2020 సీజన్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ సీజన్‌లో ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న తొలి జట్టుగా నిలిచింది. సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించకపోవడం అదే తొలిసారి...

మళ్లీ 2022 సీజన్‌లో రైనా, జట్టులో లేడు. ఈసారి ముంబై ఇండియన్స్ తర్వాత ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రెండో జట్టుగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్... రైనా లేని రెండు సీజన్లలోనూ సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించకపోవడం విశేషం...

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 97 పరగులకి ఆలౌట్ అయ్యి, చిత్తుగా ఓడింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ నుంచి ఈ రకమైన ఆటతీరు ఊహించలేకపోయారు ఫ్యాన్స్...
 

అయితే ఈ మ్యాచ్‌కి హాజరైన భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా మాత్రం సీఎస్‌కే ఓటమిని తెగ ఎంజాయ్ చేసినట్టే కనిపించడం విశేషం...

‘రైనా, నీ టీమ్ 97 పరుగులకే ఆలౌట్ అయిపోయింది... దీని గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్...’ అంటూ సురేష్ రైనాని నవ్వుతూ ప్రశ్నించాడు యువరాజ్ సింగ్...

దానికి సురేష్ రైనా కూడా నవ్వుతూ... ‘ఈ మ్యాచ్‌లో నేను లేను... ’ అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

లక్కీ ప్లేయర్‌ అయిన రైనాని కొనుగోలు చేయకుండా సీఎస్‌కే తప్పు చేసిందని, వచ్చే సీజన్‌లో అయినా అతన్ని తిరిగి జట్టులోకి తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్...

click me!