విరాట్, ధోనీ, రోహిత్... పిల్లలు రా మీరంతా! సచిన్ టెండూల్కర్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌లో...

First Published May 13, 2022, 6:39 PM IST

విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, రోహిత్ శర్మ... ప్రస్తుతతరంలో లెజెండరీ క్రికెటర్లు. కెప్టెన్లుగా, బ్యాట్స్‌మెన్‌గా టన్నుల్లో పరుగులు చేసిన ఈ ముగ్గురూ... ఆల్‌టైం గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఫెవరెట్స్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయారు. భారత మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’ తాజాగా తన ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు...

వీరేంద్ర సెహ్వాగ్: సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఎన్నో మ్యాచుల్లో ఓపెనింగ్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. టెస్టుల్లో రెండు త్రిబుల్ సెంచరీలు బాదిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా, సచిన్ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డులు క్రియేట్ చేసిన సెహ్వాగ్‌ని టెండూల్కర్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓపెనర్‌గా చోటు దక్కింది.

సునీల్ గవాస్కర్: సచిన్ టెండూల్కర్ ఫెవరెట్ క్రికెటర్లలో సునీల్ గవాస్కర్ ఒకరు. టెస్టుల్లో 34 సెంచరీలు చేసిన గవాస్కర్ రికార్డును సచిన్ అధిగమించాడు. టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన గవాస్కర్‌కి టెండూల్కర్ టీమ్‌లో మరో ఓపెనర్‌గా స్థానం లభించింది.

Latest Videos


బ్రియాన్ లారా: టెస్టుల్లో 400 స్కోరు బాదిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా. ఈ విండీస్ దిగ్గజం, సచిన్ టెండూల్కర్‌తో కలిసి పరుగులు చేయడంతో పోటీపడ్డాడు. లారాని తన టీమ్‌లో వన్ డౌన్‌ ప్లేయర్‌గా చోటు కల్పించాడు టెండూల్కర్...

వీవ్ రిచర్డ్స్: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ వీవిన్ రిచర్డ్స్, తన కెరీర్‌లో 308 మ్యాచులు ఆడి 15 వేలకు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. రిచర్డ్స్‌కి టెండూల్కర్ టీమ్‌లో స్థానం దక్కింది.

జాక్వస్ కలీస్: పరుగులు చేయడంతో సచిన్ టెండూల్కర్‌తో, వికెట్లు తీయడంలో అనిల్ కుంబ్లేతో పోటీపడిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్‌కి మాస్టర్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దొరికింది...

Sourav Ganguly, Sachin Tendulkar

సౌరవ్ గంగూలీ: కెప్టెన్‌గా, ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా భారత జట్టులో సంచలన మార్పులు చేశాడు సౌరవ్ గంగూలీ. గంగూలీ కెప్టెన్సీలో ఎన్నో మ్యాచులు ఆడిన సచిన్ టెండూల్కర్, ఓపెనర్‌గానూ దాదాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు...

ఆడమ్ గిల్‌క్రిస్ట్: ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, తన కెరీర్‌లో 96 టెస్టులు, 287 వన్డేలు ఆడాడు. మొత్తంగా 33 సెంచరీలు బాది, 15 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన గిల్‌క్రిస్ట్‌కి సచిన్ టెండూల్కర్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దొరికింది.

షేన్ వార్న్: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్, దివంగత షేన్ వార్న్‌.. టెస్టుల్లో 700లకు పైగా వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో, టెస్టుల్లో కలిపి 1000కి పైగా వికెట్లు తీశాడు. కోచ్‌గానూ సూపర్ సక్సెస్ అయ్యాడు.

వసీం అక్రమ్: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్, తన కెరీర్‌లో 104 టెస్టుల్లో 414 వికెట్లు తీశాడు. 356 వన్డేల్లో 502 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 6 వేలకు పైగా పరుగులు సాధించాడు. 

హర్భజన్ సింగ్: భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కి సచిన్ టెండూల్కర్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం విశేషం. తన కెరీర్‌లో 103 టెస్టులు, 236 వన్డేలు ఆడిన హర్భజన్ సింగ్, 686 వికెట్లు పడగొట్టాడు... 

గ్లెన్ మెక్‌గ్రాత్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ 124 టెస్టుల్లో 563 వికెట్లు పడగొట్టాడు. 250 వన్డేల్లో 381 వికెట్లు తీసి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లను తన బౌలింగ్‌తో భయపెట్టాడు...

టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లేతో పాటు సచిన్ టెండూల్కర్‌తో పోటీపడి పరుగులు సాధించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కి కూడా ‘మాస్టర్’ ప్రకటించిన ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం విశేషం. 

click me!