ఆ ప్లేయర్ కోసం రూ.20 కోట్లు పెట్టడానికి రెఢీ... ఆర్‌సీబీ నెక్ట్స్ కెప్టెన్ అతనే...

Published : Feb 03, 2022, 12:27 PM ISTUpdated : Feb 03, 2022, 07:25 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఈ వేలంలో మూడు జట్లు, కెప్టెన్ కోసం పోటీపడనున్నాయి. దీంతో గతంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు కెప్టెన్సీ చేసిన ప్లేయర్లకు ఫుల్లు డిమాండ్ ఏర్పడింది...

PREV
19
ఆ ప్లేయర్ కోసం రూ.20 కోట్లు పెట్టడానికి రెఢీ... ఆర్‌సీబీ నెక్ట్స్ కెప్టెన్ అతనే...

ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్సీ చేసి శ్రేయాస్ అయ్యర్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు కూడా పోటీలో నిలిచిందనే వార్త, చాలారోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

29

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటికే 9 సీజన్లలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్. అయితే రోహిత్ శర్మ తర్వాత జట్టును నడిపించే సారథిగా శ్రేయాస్ అయ్యర్‌ను చూస్తోందట ముంబై యాజమాన్యం...

39

శ్రేయాస్ అయ్యర్‌ కూడా ముంబైకి చెందినవాడే కావడంతో అతన్ని ఎలాగైనా టీమ్‌లోకి తీసుకురావాలని ముంబై ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అనధికారికంగా ఐపీఎల్ కెరీర్‌లో ఇదే ఆఖరి మెగా వేలం...

49

ఇకపై సాధారణ వేలం తప్ప, మెగా వేలం ఉండదని బీసీసీఐ అధికారులు తెలియచేశారు. దీంతో ఈసారి శ్రేయాస్ అయ్యర్‌ని మిస్ చేసుకుంటే, మళ్లీ అతను వేలంలోకి రాకపోవచ్చనే భయం కూడా ముంబై ఇండియన్స్‌ను వెంటాడుతోందట...

59

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్‌ కోసం కూడా ఫ్రాంఛైజీలు పోటీపడనున్నాయి. వార్నర్ కెప్టెన్సీలో 2016లో ఆర్‌సీబీని ఓడించి, ఐపీఎల్ టైటిల్ సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

69

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆర్‌సీబీ కెప్టెన్‌ ఎవరనే విషయంలో క్లారిటీ లేదు. డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా చేయాలని ఆర్‌సీబీ ఫిక్స్ అయ్యిందని, అవసరమైతే అతని కోసం రూ.20 కోట్లు చెల్లించడానికైనా సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి...

79

ఇంతకుముందు ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒక్క సిక్సర్ కూడా బాదని గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఏకంగా రూ.14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. అలాగే కేల్ జెమ్మీసన్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసింది...

89

అలా చూసుకుంటే డేవిడ్ వార్నర్‌ను కొనాలని రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు ఫిక్స్ అయితే మాత్రం రూ.20 కోట్లు చెల్లించడానికి వాళ్లు వెనకాడరు. అందులో ఎలాంటి సందేహం లేదు...

99

‘ఆర్‌సీబీ, డేవిడ్ వార్నర్‌ను ఎలాగైనా కొనాలని అనుకుంటున్నారు. వాళ్లు అతని కోసం రూ.20 కోట్లు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని నాకు తెలిసింది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

Read more Photos on
click me!

Recommended Stories