IPL 2022: ఐపీఎల్ వేలంలో నాకు 15-16 కోట్లు వద్దు.. అవి చాలు.. : టీమిండియా స్పిన్నర్ చాహల్ ఫన్నీ కామెంట్స్

Published : Feb 03, 2022, 11:02 AM ISTUpdated : Feb 03, 2022, 07:25 PM IST

IPL Auction 2022: ఐపీఎల్ లో ఇప్పటివరకు 114 మ్యాచులాడిన  చాహల్ 138 వికెట్లు తీసుకున్నాడు. 2013లో అతడు ఐపీఎల్ లో అరంగ్రేటం చేసిన చాహల్ 2014 నుంచి  ఆర్సీబీ తరఫునే ఆడుతున్నాడు. కానీ ఈ సీజన్ లో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు.   

PREV
19
IPL 2022: ఐపీఎల్ వేలంలో నాకు  15-16 కోట్లు వద్దు.. అవి చాలు.. :  టీమిండియా స్పిన్నర్ చాహల్ ఫన్నీ కామెంట్స్

టీమిండియా స్పిన్నర్, గత సీజన్  వరకు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు  ప్రాతినిథ్యం వహించిన యుజ్వేంద్ర చాహల్ తనకు ఐపీఎల్ వేలంలో ఎంతవరకు కావాలో చెప్పాడు.

29

స్టార్ ప్లేయర్ల మాదిరి తానేం తనకు రూ. 15 కోట్లు నుంచి రూ. 17 కోట్లు కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశాడు. అయితే తాను ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడినా... ఆర్సీబీతో మాత్రం అనుబంధం ఎప్పటికీ విడదీయరానిదని అన్నాడు. 

39

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన యూట్యూబ్ ఛానెల్ లో ఏర్పాటుచేసిన లైవ్ కార్యక్రమానికి చాహల్ అతిథిగా వచ్చాడు. ఈ సందర్బంగా చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 
 

49

వచ్చే ఐపీఎల్ లో ఏ జట్టుకు ఆడాలని ఉందని అశ్విన్.. చాహల్ ను ప్రశ్నించాడు. దీనికి అతడు సమాధానమిస్తూ.. ‘ఆర్సీబీ..  అందులో సందేహమే లేదు.  ఆర్సీబీతో నాది ఎనిమిదేండ్ల అనుబంధం. 

59

అలా అని నేను కొత్త జట్టు తరఫున ఆడలేనని కాదు.. ఏ జట్టుకు ఆడినా నేను  వంద శాతం  ఇస్తుంటా. అయితే కొత్త ఫ్రాంచైజీలో సర్దుబాటు కావడానికి నాకు కొంత సమయం పడుతుంది.. ’ అని తెలిపాడు. 
 

69

ఇక ఐపీఎల్  2022 వేలంలో నీకు ఎంత ధర రావాలని కోరుకుంటున్నావని చాహల్ ను అశ్విన్ ప్రశ్నించాడు. దానికి చాహల్ మాట్లాడుతూ.. ‘నాకు రూ. 15 కోట్లు, రూ. 17 కోట్లు కావాలని కోరుకోవడం లేదు. నాకు రూ. 8 కోట్లు ఇచ్చినా చాలు. ఆ జట్టు గెలుపు కోసం నా వంద శాతం ఇస్తా.. ’అని అన్నాడు.  దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరబూశాయి. 
 

79

అయితే తాను ఇప్పుడు  అనుభవిస్తున్నదంతా ఆర్సీబీ వల్లే అని చాహల్ అన్నాడు. తనను తాను నిరూపించుకోవడానికి ఆర్సీబీ ఒక వేదిక ఇచ్చిందని, క్రికెటర్ గా తన  ప్రయాణం ప్రారంభమైన తర్వాత బౌలర్ గా తాను  కొన్ని రంజీ మ్యాచులు మాత్రమే ఆడానని చాహల్ చెప్పాడు. కానీ ఐపీఎల్ లో మెరుగ్గా రాణించడం వల్ల  తనలో నమ్మకం పెరిగిందని, అదే టీమిండియాలో రావడానికి దోహదపడిందని చెప్పుకొచ్చాడు. 

89

ఐపీఎల్ లో ఇప్పటివరకు 114 మ్యాచులాడిన  చాహల్ 138 వికెట్లు తీసుకున్నాడు. 2013లో అతడు ఐపీఎల్ లో అరంగ్రేటం చేశాడు. తొలుత అతడు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. కానీ 2014 వేలంలో అతడిని ఆర్సీబీ దక్కించుకుంది.

99

అప్పట్నుంచి  2021 సీజన్ దాకా ఆ  జట్టుతోనే ఆడాడు. గత సీజన్ లో ఆర్సీబీ తరఫున  15 మ్యాచులాడి  18 వికెట్లు పడగొట్టాడు. కానీ  ఈ సీజన్ కు  ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు.
 

click me!

Recommended Stories