విరాట్ కోహ్లీకి ఐపీఎల్ కంటే అదే ముఖ్యం, మీటింగ్‌లకు కూడా రాడు... ఆర్‌సీబీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్...

Published : May 01, 2021, 09:19 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడింది. ఎప్పటిలాగే ఆరంభంలో అదరగొట్టి, ఆ తర్వాత ఊదరగొడతారేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న సమయంలో ఆర్‌సీబీ ప్లేయర్ డానియల్ క్రిస్టియన్, విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్లు చేశాడు.

PREV
18
విరాట్ కోహ్లీకి ఐపీఎల్ కంటే అదే ముఖ్యం, మీటింగ్‌లకు కూడా రాడు... ఆర్‌సీబీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2021 వేలంలో ఆసీస్ సీనియర్ ప్లేయర్ 37 ఏళ్ల డానియల్ క్రిస్టియన్‌ను రూ.4 కోట్ల 80 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

28

సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో జడేజా క్యాచ్ మిస్ చేసిన డాన్ క్రిస్టియన్, బ్యాటుతో కానీ బాల్‌తో కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పెద్దగా ఉపయోగపడింది లేదు...

38

తాజాగా డాన్ క్రిస్టియన్, ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కొన్ని సంచలన కామెంట్లు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీపై క్రిస్టియన్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేగడానికి కారణమయ్యాయి...

48

‘విరాట్ కోహ్లీకి ఐపీఎల్ కంటే ఎక్కువగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మీదే మనసు ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. ఎలాగైనా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలవాలనే ఉద్దేశంతో ఐపీఎల్ ప్రాక్టీస్ సమయంలో కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు

58

ప్రతీ మ్యాచ్‌కి ముందు ఆర్‌సీబీ టీమ్ ప్లానింగ్ కోసం మీటింగ్స్ పెడుతూ ఉంటుంది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ సమావేశాలకు హాజరుకాడు. చాలా మీటింగ్స్‌ అతను లేకుండానే జరుగుతాయి.

68

కొన్ని మీటింగ్స్‌కి మాత్రమే విరాట్ కోహ్లీ వస్తాడు. అయితే ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటాడు... ప్రాక్టీస్ సెషన్స్‌లో న్యూజిలాండ్ పేసర్ జెమ్మీసన్‌తో డ్యూట్ బాల్స్‌తో ప్రాక్టీస్ చేయమని కోరాడు కోహ్లీ, దానికి జెమ్మీసన్ సారీ చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు డాన్ క్రిస్టియన్.

78

ఆర్‌సీబీ ప్లేయర్ డానియల్ క్రిస్టియన్ ఇచ్చిన ఇంటర్వ్యూపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. దీంతో ఆ వీడియోను తీసేయమని కోరుతూ సదరు యూట్యూబ్ ఛానెల్‌ని కోరాడట ఆసీస్ ఆల్‌రౌండర్...

88

ఈ విషయాన్ని తెలుపుతూ వీడియోను తొలగిస్తున్నట్టు తెలిపింది ‘ద గ్రేడ్ క్రికెటర్’ యూట్యూబ్ ఛానెల్. ‘ఈ వీడియోలో క్రిస్టియన్ చేసిన వ్యాఖ్యలు, ఐపీఎల్ నియమనిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయట. అందుకే దాన్ని తొలగించాలని అతను కోరాడు. అందుకే తీసేస్తున్నాం’ అంటూ తెలియచేసింది యూట్యూబ్ ఛానెల్...

click me!

Recommended Stories