రోహిత్ శర్మకు నమ్మకం తగ్గిందా... జట్టులో ఇన్ని మార్పులా?... ఇషాన్ కిషన్‌ని పక్కనబెట్టి...

First Published May 1, 2021, 7:55 PM IST

ఐపీఎల్ కెరీర్‌లో అతి తక్కువ సమయంలో అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. 8 సీజన్లలో 5 టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, ఈసారి మాత్రం జట్టు ప్రదర్శనపై కాస్త అసంతృప్తితో, అపనమ్మకంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది...

ఐపీఎల్ 2020 సీజన్‌‌ను డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆరంభించిన ముంబై ఇండియన్స్, మొత్తం 16 మ్యాచుల్లో కేవలం 16 మంది ప్లేయర్లను మాత్రమే ఉపయోగించింది. మిగిలిన అన్ని జట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ...
undefined
పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన ముంబై, గ్రూప్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, రాహుల్ చాహార్‌లకు విశ్రాంతినిచ్చి... వారి స్థానంలో సౌరబ్ తివారి, నాథన్ కౌంటర్‌నైల్, జేమ్స్ ప్యాటిన్సన్, ధవల్ కులకర్ణిలకు అవకాశం ఇచ్చింది.
undefined
ఈ మ్యాచ్‌ మినహా ఇస్తే మిగిలిన మ్యాచుల్లో ఒకే టీమ్‌తో బరిలో దిగింది ముంబై ఇండియన్స్. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో జయంత్ యాదవ్‌కి అవకాశం ఇచ్చి, అద్భుతమైన రిజల్ట్ రాబట్టింది.
undefined
అయితే 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆట ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. చెన్నైలో జరిగిన మొదటి ఐదు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. బౌలర్లు రాణించడంతో రెండు మ్యాచుల్లో విజయం దక్కించుకుంది ముంబై టీమ్...
undefined
ఐపీఎల్ 2020 సీజన్‌తో పోలిస్తే, 2021 సీజన్‌ను పూర్తిగా డిఫెరెంట్ యాటిట్యూడ్‌తో కనిపిస్తోంది ముంబై టీమ్. ఇప్పటికే ఆ జట్టు 20 మంది ప్లేయర్లను వాడడం విశేషం...
undefined
డి కాక్ క్వారంటైన్ పీరియడ్ పూర్తిచేసుకోకపోవడంతో అతని స్థానంలో క్రిస్ లీన్ మొదటి మ్యాచ్ ఆడాడు. అతను 49 పరుగులతో రాణించినా... తర్వాతి మ్యాచ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. డి కాక్ మీద ఉన్న నమ్మకంతో నాలుగు మ్యాచుల్లో ఫెయిల్ అయినా కొనసాగించాడు రోహిత్ శర్మ.
undefined
డి కాక్ మీద ఉంచిన నమ్మకం, భారత యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ పైన పెట్టలేదు రోహిత్ శర్మ. మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి, ఆ స్థానంలో గత మ్యాచ్‌లో నాథన్ కౌంటర్‌నైల్‌ను జట్టులోకి తీసుకొచ్చాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్.
undefined
ఆ తర్వాతి మ్యాచ్‌లో నాథన్ కౌంటర్‌నైల్‌ను పక్కనబెట్టి జేమ్స్ నీశమ్‌ను జట్టులోకి తీసుకొచ్చాడు. వీరితో పాటు ఆడమ్ మిల్నే, మార్కో జాన్సెన్‌లకు కూడా ఈ సీజన్‌లో ఆడేందుకు అవకాశం దక్కింది.
undefined
2021 సీజన్‌లో జట్టులో ఉన్న ఫారిన్ ప్లేయర్లందరికీ అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... స్వదేశీ ప్లేయర్లు జయంత్ యాదవ్‌కి మాత్రమే అవకాశం ఇచ్చాడు.
undefined
ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఉన్న పియూష్ చావ్లాతో పాటు ఆదిత్య తారే, సౌరబ్ తివారిలకు ఇంకా తుదిజట్టులో చోటు దక్కలేదు.
undefined
డి కాక్, పోలార్డ్, ట్రెంట్ బౌల్ట్ తప్ప మినహా ఫారిన్ ప్లేయర్లపై పెద్దగా ఆధారపడని ముంబై ఇండియన్స్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్ వంటి దేశీయ ప్లేయర్లతో అత్యంత పటిష్టంగా కనిపించేది.
undefined
మిగిలిన జట్లతో పోలిస్తే దుర్భేద్యమైన బ్యాటింగ్ ఆర్డర్, భీకర బౌలింగ్ ముంబై ఇండియన్స్‌కి కలిసొచ్చే అంశం. అయితే ఈ సీజన్‌లో జట్టులోని ప్లేయర్లపై పెద్దగా నమ్మకం చూపించడం లేదు ముంబై సారథి. ఇషాన్ కిషన్ లాంటి భారీ హిట్టర్‌ను పక్కనబెట్టి, ఫారిన్ ప్లేయర్లను జట్టులోకి తీసుకురావడం చూస్తే... రోహిత్ శర్మ టీమ్ పర్ఫామెన్స్‌పై అపనమ్మకంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
click me!