కరోనాతో యుద్ధానికి భారత క్రికెటర్ల సాయం... ఆక్సిజన్ సరాఫరాకి హార్ధిక్, కృనాల్ పాండ్యా, అజింకా రహానే...

First Published May 1, 2021, 8:23 PM IST

యావత్ భారతం కరోనాతో చేస్తున్న పోరాటానికి తమవంతు సాయం ప్రకటించారు భారత క్రికెటర్లు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్లు హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అజింకా రహనే కూడా తమవంతు సాయాన్ని ప్రకటించారు...

గ్రామీణ ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నవారికి సాయంగా 200 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను విరాళంగా అందిస్తున్నట్టు తెలిపారు పాండ్యా బ్రదర్స్.
undefined
‘కరోనాతో అనిరతర పోరాటం చేస్తున్న మెడికల్ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి మా ధన్యవాదాలు. కృనాల్, నేను, మా అమ్మ... మా కుటుంబమంతా ఈ పోరాటానికి మా వంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
undefined
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసదుపాయాలు సరిగా లేని ఏరియాల్లోని వారికి 200 ఆక్సిజన్ కాంటన్సేట్రేటర్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మా అందరికీ ఇది చాలా క్లిష్టమైన సమయం అని తెలుసు.
undefined
ఈ విపత్కర పరిస్థితుల నుంచి దేశం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ వీడియో సందేశం ద్వారా తెలిపాడు టీమిండియా క్రికెటర్, ముంబై ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా.
undefined
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అజింకా రహానే, కరోనాతో యుద్ధానికి తనవంతుగా 30 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను విరాళంగా ప్రకటించాడు.
undefined
మహారాష్ట్రలో కరోనాతో బాధపడుతున్నవారి సాయం చేస్తున్న మిషన్ వాయుకి 30 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను విరాళిమిచ్చిన అజింకా రహానేకి మహారాట్ట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ధన్యవాదాలు తెలిపింది.
undefined
దేశంలో పెరిగిపోతున్న సెకండ్ వేవ్ కేసులతో పోరాడేందుకు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, జయ్‌దేవ్ ఉనద్కడ్‌తో పాటు శ్రీవాత్సవ్ గోస్వామి తమవంతు సాయం చేశారు. వీరితో పాటు ఆసీస్ ప్లేయర్లు ప్యాట్ కమ్మిన్స్, బ్రెట్ లీ, విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ కూడా తమ వంతు విరాళం అందించారు.
undefined
click me!