‘సారీ కోహ్లీ, నేను నీకు బౌలింగ్ చేయను... ’ కెప్టెన్‌కి షాక్ ఇచ్చిన జెమ్మీసన్! కారణం ఏంటంటే...

Published : Apr 29, 2021, 06:52 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.15 కోట్లు పెట్టి, న్యూజిలాండ్ యంగ్ పేసర్ కేల్ జెమ్మీసన్‌ను కొనుగోలు చేసింది. సీజన్‌లో అద్భుతంగా రాణిస్తూ, ఆర్‌సీబీకి అద్భుతంగా ఉపయోగపడుతున్నాడు జెమ్మీసన్. అయితే కోహ్లీకి మాత్రం అతను సరిగా ఉపయోగపడడం లేదట...

PREV
19
‘సారీ కోహ్లీ, నేను నీకు బౌలింగ్ చేయను... ’ కెప్టెన్‌కి షాక్ ఇచ్చిన జెమ్మీసన్! కారణం ఏంటంటే...

ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. రూ.15 కోట్లు పెట్టి కేల్ జెమ్మీసన్‌ను కొనుగోలు చేయడం వెనక విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్ కూడా ఉందట.

29

న్యూజిలాండ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జెమ్మీసన్‌ బౌలింగ్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తే... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు బాగా ఉపయోగపడుతుందని భావించాడట విరాట్ కోహ్లీ. ఐపీఎల్ నెట్ సెషన్స్‌లో కూడా తన ఎత్తుగడను పారించాలని చూశాడట.

39

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వాడే డ్యూక్ బాల్‌తో తనకి నెట్స్‌లో బౌలింగ్ చేయాలని కోరాడట విరాట్ కోహ్లీ. అయితే కెప్టెన్ వినతిని సుననితంగా తిరస్కరించాడట కేల్ జెమ్మీసన్. ఈ విషయాన్ని బయటపెట్టాడు ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్.

49

‘అప్పటికి ఇంకా ఐపీఎల్ ప్రారంభమై వారం కూడా కాలేదనుకుంటా. నేను, విరాట్ కోహ్లీ, జెమ్మీసన్ నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు... ‘అయితే జిమ్మీ... నువ్వు డ్యూక్ బాల్స్‌తో బౌలింగ్ చేస్తావంట...’ అని అడిగాడు.

59

‘అవును... నా దగ్గర రెండు డ్యూక్ బాల్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్లేముందు వాటితో కాస్త ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నా...’ అంటూ సమాధానం ఇచ్చాడు జెమ్మీసన్...

69

‘అవునా... అయితే నాకు నెట్స్‌లో బౌలింగ్ చేయి... నేను డ్యూక్ బాల్స్ ఆడడం చాలా ఇష్టం’ అంటూ అన్నాడు. దానికి జెమ్మీ... ‘‘సారీ కెప్టెన్... నో ఛాన్స్... నేను నీకు బౌలింగ్ చేయను’ అని నవ్వేశాడు. విరాట్ కోహ్లీ కూడా నవ్వుతూ వెళ్లిపోయాడు. అంటూ సమాధానం ఇచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చాడు డాన్ క్రిస్టియన్.

79

జూన్ 18 నుంచి 22 వరకూ ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్‌లోని హ్యాంప్‌షైర్ బౌల్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత నేరుగా ఇంగ్లాండ్ చేరి, ఈ ఫైనల్ కోసం ప్రాక్టీస్ చేయనుంది టీమిండియా...

89

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టెస్టు కావడంతో ఈ ఫైనల్ మ్యాచ్‌కి డ్యూక్ బాల్ ఉపయోగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ల్లోనే ఈ బాల్‌ను వాడతారు. మనదేశంలో ఎస్‌జీ బాల్ ఉపయోగిస్తే, మిగిలిన దేశాల్లో కుకబురా బంతులను వాడతారు.

99

కూకబురా, ఎస్‌జీ బంతులతో పోలిస్తే డ్యూక్ బాల్ ప్రవర్తించే తీరును పసిగట్టడం చాలా కష్టం. అందుకే ఇంగ్లాండ్‌‌ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌ల్లో భారత బ్యాట్స్‌మెన్ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేక ఇబ్బంది పడుతుంటారు.

click me!

Recommended Stories