ప్రపంచకప్‌లో జడేజా లేకున్నా పర్లేదు.. అక్షర్ ఉన్నాడుగా.. భారత మాజీ బ్యాటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Sep 24, 2022, 1:35 PM IST

T20I World Cup 2022: ఆసియా కప్ లో ఒక్క మ్యాచ్ ఆడి గాయం కారణంగా టోర్నీతో పాటు త్వరలో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కూ దూరమైన  టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం కాలికి  ఆపరేషన్ చేయించుకున్నాడు.  

వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో భారత్ తరఫున ఆడేందుకు ఎంపిక చేసిన 15 మంది జట్టు సభ్యులలో  యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ పేరు కూడా ఉంది.  రవీంద్ర జడేజాకు గాయం కావడంతో సెలక్టర్లు లెఫ్టార్మ్ స్పిన్ ఆల్ రౌండర్ కోటాలో అక్షర్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. 

అయితే జడేజా అనుభవంతో పోల్చితే అక్షర్ కు చాలా తక్కువ. ఈ ఇద్దరూ  ఎడమ చేతి వాటం బౌలర్లు.. బ్యాటింగ్ కూడా అదే శైలి. అయితే  జడేజా లేని లోటును అక్షర్ భర్తీ చేయగలడా..? అనేది  జట్టును ఎంపిక చేసినప్పుడు ప్రతీ ఒక్కరికి కలిగిన అనుమానం. కొంతమందైతే అక్షర్ కు బదులు షమీని గానీ మరో స్పెషలిస్టు స్పిన్నర్ ను గానీ తీసుకోవాలని  సూచించారు. 

Image credit: PTI

కానీ ప్రపంచకప్ లో తనను ఎందుకు తీసుకోవాలో అక్షర్ చెప్పకనే చెబుతున్నాడు. తనను విమర్శించిన వారికి బంతితోనే సమాధానం పంపిస్తున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా ముగిసిన రెండు మ్యాచ్ లలో భారత్ తరఫున రాణించిన ఒకే ఒక బౌలర్ అక్షర్ పటేల్. 

Image credit: PTI

మొహాలీ  మ్యాచ్ లో టీమిండియా బౌలర్లంతా విఫలమైనా  అక్షర్ మాత్రం రాణించాడు. ఆ మ్యాచ్ లో అక్షర్.. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో సీనియర్ పేసర్ భువనేశ్వర్, స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. 

Image credit: PTI

ఇక శుక్రవారం నాగ్‌పూర్ లో ముగిసిన రెండో మ్యాచ్ లో కూడా ఆసీస్ ను నిలువరించింది అక్షరే కావడం గమనార్హం. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో అతడు.. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులే ఇచ్చి  2 వికెట్లు పడగొట్టాడు. అతడి ఓవర్లోనే ఆసీస్ ప్రమాదకర ఆటగాడు కామెరూన్ గ్రీన్ రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా, హర్షల్ పటేల్ లు కూడా భారీగా పరుగులిచ్చుకున్నారు. 

ఈ నేపథ్యంలో జాఫర్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ లో జడేజా లేని లోటును అక్షర్ పటేల్ తీర్చుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. నాగ్‌పూర్ టీ20 ముగిసిన తర్వాత ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం ప్రకారం టీ20  ప్రపంచకప్ కు జడేజా సేవలు  మిస్ అవుతున్నాడని నాకు అనిపించడం లేదు. ఇప్పటికే ఇండియా.. అక్షర్ పటేల్ రూపంలో అతడిని భర్తీ చేసింది. 
 

పవర్ ప్లేలలో అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. అక్షర్.. స్టంప్స్ లక్ష్యంగా బంతులు విసరుతున్నాడు. బ్యాటర్లు బంతి మిస్ అయితే అది నేరుగా వికెట్లను పడగొడుతున్నది..’ అని తెలిపాడు. 

అయితే బౌలింగ్ లో అక్షర్ ఫర్వాలదేనిపిస్తున్నా బ్యాటింగ్ లో జడేజా లేని లోటును అతడు ఏ మేరకు పూరిస్తాడనేది వేచి చూడాలి. ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో అక్షర్ కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్ లో అతడు 5 బంతులాడి 6 పరుగులే చేసి ఔటయ్యాడు. 

 నిన్నటి మ్యాచ్ ముగిశాక  రోహిత్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశాడు. బౌలింగ్ విషయంలో అక్షర్ పటేల్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని.. అయితే అతడు బ్యాటింగ్ ఎలా చేస్తాడనేది చూడాలని చెప్పుకొచ్చాడు. 

click me!