MS Dhoni - Rohit Sharma: టీమండియా సారథి రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఫీల్డింగ్ లో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతున్నది. క్యాచ్ లు మిస్ చేసినప్పుడు అతడు.. ఫీల్డర్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని అందరూ ‘కెప్టెన్ కూల్’ అని పిలుస్తారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా ధోని ప్రశాంతంగా ఉంటూ పనులను చక్కబెడతాడు. ఆ జాబితాలో తర్వాత వినిపించిన పేరు రోహిత్ శర్మ.
29
రోహిత్ టీమిండియా కెప్టెన్ కాకముందు ముంబై ఇండియన్స్ తరఫున సారథిగా ఉండి సైలెంట్ గా పనులు కానిచ్చేవాడు. భారత జట్టుకు సారథి అయ్యాక కూడా రోహిత్ ను అందరూ ధోనితో పోల్చారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ‘మిస్టర్ కూల్’ కావడంతో ఇద్దరూ కలిసి అద్భుతాలు సృష్టిస్తారని భావించారంతా.
39
అయితే టీమిండియా వరుసపెట్టి మ్యాచ్ లు గెలిచినన్ని రోజులు అంతా బాగానే ఉంది. కానీ ఆసియా కప్ నుంచే అసలు కథ మొదలైంది. కీలక మ్యాచ్ లలో భారత్ ఓడటంతో రోహిత్ లో నిరాశ, నిస్ప్రుహలు పెరగుతున్నాయి. గ్రౌండ్ లో ఫీల్డర్లు ,బౌలర్ల మీద అరుస్తున్నాడు.
49
ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ లో అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ ను మిస్ చేసిన అర్ష్దీప్ సింగ్ పై అరవడం.. ఆ తర్వాత మ్యాచ్ లో అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్ మార్చమన్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.
59
ఇక ఆస్ట్రేలియాతో తొల మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ దగ్గరికి వెళ్లి క్యాచ్ అవుట్ ఎందుకు అప్పీల్ చేయలేదని అతడి మెడ పట్టుకోవడం వంటివన్నీ వివాదాస్పదమయ్యాయి. రోహిత్ తన ప్రశాంతతను కోల్పోతున్నాడని ఇది అతడితో పాటు జట్టుకు కూడా మంచిదికాదనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
69
ఈ నేపథ్యంలో మాజీ సారథి ధోని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు రోహిత్ ను ఉద్దేశించి చేసినవేనని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. శుక్రవారం లివ్ ఫాస్ట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ.. ‘నిజాయితీగా చెప్పాలంటే ఫీల్డ్ లో మేం ఏ తప్పూ చేయొద్దని అనుకుంటాం. ఒక ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేసినా, మిస్ ఫీల్డ్ అయినా అలా ఎందుకైందని నేను ఆలోచిస్తాను. కోపం తెచ్చుకుని వాళ్ల మీద అరవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు.
79
అప్పటికే స్టేడియంలో 40 వేల మంది ప్రేక్షకులు, టీవీల ముందు కోట్లాది మంది అభిమానులు మ్యాచ్ ను వీక్షిస్తుంటారు. అయితే సదరు ఫీల్డర్ మిస్ ఫీల్డ్ ఎందుకు చేస్తాడనేది నేను ఆలోచిస్తాను.
89
ఒక ఆటగాడు గ్రౌండ్ లో వంద శాతం శ్రద్ధగా ఉండి ఆ తర్వాత కూడా క్యాచ్ మిస్ చేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే సదరు ఆటగాడు ప్రాక్టీస్ లో ఎన్ని క్యాచ్ లు పట్టాడు..? ముందు మ్యాచుల్లో ఎన్ని క్యాచ్ లు పట్టాడు..? అన్నది నేను గుర్తుంచుకుంటా.. క్యాచ్ వల్ల మ్యాచ్ ఓడిపోవచ్చేమో గానీ ఫీల్డర్ కోణంలో కూడా ఆలోచిండం ముఖ్యం..’ అని తెలిపాడు.
99
అయితే ధోని అన్న ఈ మాటలు రోహిత్ ను ఉద్దేశించి చేసినవేనని అతడి యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. రోహిత్ కెప్టెన్ అయిన కొత్తలో చాహల్, భువీ మీద అరిచి ఇలాగే విమర్శల పాలైన విషయం తెలిసిందే.