WI vs IND:ఇంగ్లాండ్ తో మూడో వన్డే సందర్భంగా జడేజాకు ఎడమ కాలి మోకాలి గాయం తిరగబెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో అతడు అప్పట్నుంచి అసౌకర్యంగానే ఉంటున్నాడని జట్టు వర్గాలు తెలిపాయి.
వెస్టిండీస్ తో సిరీస్ కు ముందే భారత జట్టుకు వరుస షాకులు తాకుతున్నాయి. శుక్రవారం ప్రారంభం కావాల్సిన తొలి వన్డేకు ముందే భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమితుడైన జడేజా గాయంతో తొలి వన్డే ఆడేది అనుమానంగానే ఉంది.
27
టీమిండియా రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ల గైర్హాజరీతో భారత జట్టు విండీస్ టూర్ లో కెప్టెన్ గా శిఖర్ ధావన్, వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజాలను నియమించింది. అయితే వీరిలో తాజాగా జడేజాకు గాయమైనట్టు తెలుస్తున్నది.
37
ఈ ఏడాది ప్రారంభం నుంచి గాయాలతో బాధపడుతున్న జడేజా.. తాజాగా విండీస్ సిరీస్ కు ముందు కూడా గాయపడ్డాడు. జడేజా.. గతేడాది డిసెంబర్ లో న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతూ గాయపడ్డాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేదు.
47
Ravindra Jadeja
కొద్దిరోజుల విరామం తర్వాత ఐపీఎల్ ఆడినా చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన చివరి నాలుగు మ్యాచులలో కనిపించలేదు. గాయం కారణంగానే జడేజా ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపికైన జడ్డూ.. అక్కడ టెస్టుతో పాటు 2 టీ20లు, మూడు వన్డేలు ఆడాడు.
57
అయితే ఇంగ్లాండ్ తో మూడో వన్డే సందర్భంగా జడేజాకు ఎడమ కాలి మోకాలి గాయం తిరగబెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో అతడు అప్పట్నుంచి అసౌకర్యంగానే ఉంటున్నాడని జట్టు వర్గాలు తెలిపాయి. ఇక విండీస్ తో వన్డే సిరీస్ కు ముందు మళ్లీ అదే నొప్పి తిరగబెట్టడంతో అతడు తొలి వన్డే నుంచి తప్పుకున్నట్టు తెలుస్తున్నది.
67
జడేజా తొలి వన్డే ఒక్కడే తప్పుకుంటాడా..? లేక మొత్తం వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటాడా..? అన్నది మాత్రం తేలాల్సి ఉంది. జడేజా మాత్రం మొత్తం వన్డే సిరీస్ నుంచి తప్పుకుని తిరిగి టీ20 లలో ఆడాలని భావిస్తున్నాడని తెలుస్తున్నది.
77
జడేజాకు గాయం కావడంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు..? వైస్ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనేది తేలాల్సి ఉంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు విండీస్ తో తొలి వన్డే ప్రారంభమవుతుంది.