ఇషాంత్ శర్మ అవుట్... నాలుగో టెస్టులో అతనికి అవకాశం ఇవ్వకపోతే...

First Published Aug 31, 2021, 3:29 PM IST

భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు నాలుగో టెస్టులో ప్లేస్ దక్కడం అనుమానంగా మారింది. మూడో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన టీమిండియా, నాలుగో టెస్టులో కనీసం రెండు మార్పులతో బరిలో దిగుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు...

రెండో టెస్టులో 22 ఓవర్లు వేసినా, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఇషాంత్ శర్మ. సీనియర్ మోస్ట్ బౌలర్ మీద ఉన్న నమ్మకంతో బుమ్రా, షమీలను పక్కనబెట్టి ఇషాంత్ శర్మతో ఓపెనింగ్ ఓవర్ వేయించాడు విరాట్ కోహ్లీ...

రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్ ఇషాంత్ శర్మే వేశాడు. అయితే వికెట్ తీయలేకపోగా 4.02+ రన్‌రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు ఇషాంత్. దీంతో అతనికి నాలుగో టెస్టులో చోటు దక్కడం అనుమానంగా మారింది...

ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్‌కి చోటు ఇవ్వాలని భావిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, అత్యధికంగా మూడు వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్‌కి మొదటి మూడు టెస్టుల్లో చోటు దక్కలేదు...

అలాగే స్వింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఇషాంత్ శర్మ ప్లేస్ కోసం పోటీపడుతున్నాడు. ఉమేశ్ యాదవ్ కంటే శార్దూల్ ఠాకూర్‌కి బ్యాటుతో మంచి రికార్డు ఉండడంతో నాలుగో టెస్టులో ఈ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది...

తొలి టెస్టులో జో రూట్ వికెట్ తీసిన శార్దూల్ ఠాకూర్ ఉంటే లోయర్ ఆర్డర్‌లో కూడా పరుగులు వస్తాయని విరాట్ కోహ్లీ భావిస్తే... ఉమేశ్ యాదవ్‌కి నిరాశ తప్పదు.

రవీంద్ర జడేజా గాయపడడంతో అతని ప్లేస్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ బరిలో దిగే అవకాశం ఉంది. మొదటి మూడు టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్, నాలుగో టెస్టు కూడా ఆడకపోతే టీమ్ సెలక్షన్ విషయంలో విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది...

జో రూట్‌ను నిలువరించడంతో భారత ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్ జడేజా కూడా విఫలమయ్యాడు. కాబట్టి జో రూట్ వికెట్ తీయగల సత్తా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ లేదా అక్షర్ పటేల్‌లను తుదిజట్టులో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

అలాగే బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ కొన్ని మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఛతేశ్వర్ పూజారా మూడో టెస్టులో 91 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. అజింకా రహానే మాత్రం భారీ స్కోరు చేయలేకపోతున్నాడు...

ఈ ఇద్దరికీ నాలుగో టెస్టులో విశ్రాంతినిచ్చి పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారి వంటి ప్లేయర్లను ఆడించే అవకాశం ఉందని సమాచారం...
  

click me!