టీమిండియాకు వరల్డ్ క్లాస్ బౌలింగ్ ఉంది... కానీ రవీంద్ర జడేజా లేకపోవడం పెద్ద లోటే...

First Published | Jan 30, 2021, 11:14 AM IST

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోంది భారత క్రికెట్ జట్టు. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు చెన్నై చేరుకుని, క్వారంటైన్‌లో గడుపుతున్నారు. అయితే టెస్టు సిరీస్‌కి ముందు ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది...

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో గాయపడిన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరమైన సంగతి తెలిసిందే.
గాయం కారణంగా రవీంద్ర జడేజా ఎడమ చేతి బొటిన వేలుకి సర్జరీ నిర్వహించాల్సి వచ్చింది. జడ్డూ కోలుకోవడానికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు...

శ్రీలంక పర్యటనలో యంగ్ స్పిన్నర్ ఎంబ్లుదినియాను ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడిందని, భారత జట్టులో జడేజా లేకపోవడం తమకు కలిసొస్తుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ బర్చర్ అన్నాడు..
‘జడేజా లేకపోవడం ఇంగ్లాండ్ జట్టుకి తప్పకుండా కలిసి వస్తుంది. నిజమే భారత జట్టుకి వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్ ఉంది... కానీ జడేజా ప్రత్యేకం...
అంచనాలను తలకిందులు చేసేలా రాణించడం రవీంద్ర జడేజా ప్రత్యేకత. ఎలాంటి బ్యాట్స్‌మెన్‌ను అయినా జడ్డూ ఇబ్బంది పెట్టగలడు...
టెస్టు సిరీస్‌కు రవీంద్ర జడేజా దూరం కావడం కచ్ఛితంగా మాకు కలిసొచ్చే విషయమే... ’ అంటూ వ్యాఖ్యానించాడు 71 టెస్టులు ఆడిన మార్క్ బర్చర్.
ఇప్పటికే చెన్నై చేరిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు, భారత స్పిన్ బౌలింగ్ విభాగాన్ని ఎలా ఎదుర్కోవాలో వ్యూహ రచన చేస్తోంది...
ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ గ్రాహమ్ త్రోపే... భారత స్పినర్ల బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడడానికి ఎక్కువగా ప్రయత్నించకూడదని ఇంగ్లాండ్ జట్టుకి సూచించాడు...
శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కి దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇండియాతో జరిగే టెస్టు సిరీస్‌లో బరిలో దిగబోతున్నారు. వీరితో పాటు ఓపెనర్ రోరీ బర్న్స్ కూడా బరిలో దిగనున్నాడు.
ఇప్పటికే 6 రోజుల క్వారంటైన్ పీరియడ్‌తో పాటు రెండు సార్లు కరోనా పరీక్షలు కూడా పూర్తిచేసుకున్న ఆర్చర్, బెన్‌స్టోక్స్, రోరీ... శనివారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.
రవీంద్ర జడేజా అందుబాటులో లేకపోవడంతో రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్‌కి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. లేదా ఈ ఇద్దరికీ బదులుగా ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్‌కి కూడా తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

Latest Videos

click me!