రవిచంద్రన్ అశ్విన్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు... సచిన్, సెహ్వాగ్‌లకు కూడా సాధ్యంకాని ఫీట్...

First Published Mar 6, 2021, 4:51 PM IST

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-3 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. రెండో టెస్టులో సెంచరీతో పాటు నాలుగు టెస్టుల్లో 32 వికెట్లు, 189 పరుగులు చేసిన భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కించుకోగా... రిషబ్ పంత్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది...

78వ టెస్టు మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలవడం ఇది 8వ సారి. భారత జట్టు తరుపున అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచిన ప్లేయర్‌గా నిలిచాడు అశ్విన్...
undefined
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ 11సార్లు, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కలీస్ 9సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచి, రవిచంద్రన్ అశ్విన్ కంటే ముందున్నారు. భారత మాజీ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్‌లో ఐదుసార్లు మాత్రం సిరీస్ అవార్డులు గెలిచారు..
undefined
అంతేకాకుండా ఆరు భిన్నదేశాలపై ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన క్రికెటర్‌గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. విండీస్‌పై రెండుసార్లు, న్యూజిలాండ్‌పై రెండుసార్లు ఈ ఫీట్ సాధించిన అశ్విన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌పై సిరీస్ అవార్డులను సొంతం చేసుకున్నాడు...
undefined
స్వదేశంలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న రెండో ప్లేయర్ అశ్విన్. ముత్తయ్య మురళీధరన్ స్వదేశంలో 8 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవగా, అశ్విన్, కలీస్ ఆరేసి సార్లు ఈ ఫీట్ సాధించారు...
undefined
ఈ టెస్టు సిరీస్‌లో నాలుగు టెస్టుల్లో 32 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇంతకుముందు 2015లో సౌతాఫ్రికాపై 31 వికెట్లు, ఆస్ట్రేలియాపై 2013లో 29 వికెట్లు తీయడమే అశ్విన్ కెరీర్‌లో బెస్ట్ పర్ఫామెన్స్‌గా ఉండేవి...
undefined
టెస్టు కెరీర్‌లో 30వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన కనబర్చిన రవిచంద్రన్ అశ్విన్, అత్యధికసార్లు ఈ ఫీట్ సాధించిన ఆరో ప్లేయర్‌గా నిలిచాడు. ముత్తయ్య మురళీధరన్ 67, షేన్ వార్న్ 37, హర్లీ 36, అనిల్ కుంబ్లే 34, రంగనా హేరాత్ 34 మాత్రమే అశ్విన్ కంటే ముందున్నారు.
undefined
click me!