అప్పుడు లేవని నోరు, ఇప్పుడు లేస్తుందే... ఇంగ్లాండ్‌పై సీరియస్ అయిన రవిచంద్రన్ అశ్విన్..

First Published Feb 28, 2021, 11:28 AM IST

ఇంగ్లాండ్, టీమిండియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంతో మొతేరా పిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది ఇంగ్లాండ్ మీడియా. ఈ పిచ్‌ టెస్టులకు పనికి రాదని, ఇక్కడ టెస్టు మ్యాచులు ఆడకుండా ఐసీసీ నిషేధం విధించాలని వాదిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ మీడియాతో జరిగిన ఆన్‌లైన్ వీడియో ఇంటర్వ్యూలో రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లీష్ మీడియాపై ఫైర్ అయ్యాడు...

‘తర్వాతి మ్యాచ్‌లో అయినా మంచి పిచ్ ఉంటుందని ఆశించొచ్చా?’ అంటూ ఇంగ్లాండ్ రిపోర్టర్, అశ్విన్‌ను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఘాటుగా స్పందించిన రవిచంద్రన్ అశ్విన్... ‘అసలు మంచి పిచ్ అంటే ఎలా ఉండాలంటూ...’ నిలదీశాడు...
undefined
‘అసలు మంచి పిచ్ అంటే ఏంటి? బ్యాటుకి, బంతికి మధ్య మంచి పోటీ ఉండాలని అందరూ అంటారు. బౌలర్లు కూడా ఆటలో భాగమే. బౌలర్లు వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తారు. బ్యాట్స్‌మెన్ అవుట్ కాకుండా పరుగులు చేయాల్సి ఉంటుంది...
undefined
మంచి పిచ్ అంటే ఏమిటి? మొదటి రోజు పేసర్లకు, ఆ తర్వాత రెండు రోజులు బ్యాట్స్‌మెన్‌కి, మిగిలిన రెండు రోజులు స్పిన్నర్లకు సహకరించేదే మంచి పిచ్ అవుతుందా? ఎవరు చెప్పారు ఇలా? ఈ నిబంధనలు ఎవరు రూపొందించారు...
undefined
క్రికెట్ ఆడని వారికి కూడా పిచ్‌ ఇలా ఉండాలి? అలా ఉండాలి? అనే అభిప్రాయాలు ఉండొచ్చు. వాటిని పక్కవారిపై రుద్దాలని చూస్తే ఎలా? పిచ్‌లపై ఇంత డిస్కర్షన్ అనవసరం...
undefined
న్యూజిలాండ్ టూర్‌లో టీమిండియా ఆడిన రెండు టెస్టులు కలిపి ఐదు రోజుల్లోనే అయిపోయాయి. అప్పుడు పిచ్ గురించి ఎవ్వరైనా మాట్లాడారా? ఏ ఎందుకు? అప్పుడు పిచ్ గురించి రాని డిస్కర్షన్, ఇప్పుడు ఎందుకు వస్తోంది...
undefined
మేం ఏ విదేశీ టూర్‌లోనూ పిచ్ గురించి కంప్లైంట్ చేయలేదు. ఇంగ్లాండ్ ప్లేయర్లకు అలాంటి ఇబ్బంది ఉంటే, వాళ్లు ఆటను ఇంప్రూవ్ చేసుకోవాలి... సౌతాఫ్రికా టూర్‌లో విరాట్ కోహ్లీకి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. అప్పుడు కోహ్లీ... ‘నేను ఇక్కడికి పిచ్ గురించి మాట్లాడడానికి రాలేదని చెప్పాడు’... క్రికెటర్లకు అలాంటి యాటిట్యూడ్ ఉండాలి...
undefined
అంతేకానీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడినప్పుడు పిచ్ బాగోలేదని సాకులు చెప్పడం ఎందుకు?’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్.
undefined
‘వచ్చే టెస్టు మ్యాచ్‌లో ఇలాంటి పిచ్‌ ఉంటుందని ఆశించొచ్చా?’ అని మళ్లీ అడిగిన రిపోర్టర్‌కి... ‘పిచ్ గురించి కాకుండా, మంచి క్రికెట్ మ్యాచ్ కూడా మేం ఆశిస్తున్నాం... మీరేం కోరుకుంటున్నారో నాకు తెలీదు...’ అంటూ రిప్లై ఇచ్చాడు అశ్విన్.
undefined
click me!