విరాట్ కోహ్లీని బలపశువుని చేసే ప్రయత్నం చేస్తున్నారా... వరల్డ్ కప్‌‌ టీమ్‌పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్..

Published : Aug 24, 2023, 10:33 AM IST

10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిన భారత జట్టు, ఈసారి ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కైవసం చేసుకోవాలని కసిగా ప్రయత్నిస్తోంది. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ కావడంతో టీమిండియానే ఫెవరెట్. అయితే ఈసారి కూడా భారత జట్టును అనేక సమస్యలు వెంటాడుతున్నాయి..

PREV
18
విరాట్ కోహ్లీని బలపశువుని చేసే ప్రయత్నం చేస్తున్నారా... వరల్డ్ కప్‌‌ టీమ్‌పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్..
Image credit: PTI

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి కీ ప్లేయర్లు గాయంతో బాధపడుతూ నేరుగా ఆసియా కప్‌లో బరిలో దిగబోతున్నారు. ఈ ఇద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధించినా వన్డే వరల్డ్ కప్ సమయానికి మహా అయితే ఆరేడు మ్యాచులు మాత్రమే ఆడగలరు...
 

28

అలాగే జస్ప్రిత్ బుమ్రా కూడా గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వన్డే మ్యాచ్ ఆడలేదు. అంటే ఒకే మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేయలేదు. అతని ఫిట్‌నెస్‌పై పూర్తి క్లారిటీ రావడానికి ఆసియా కప్ మ్యాచుల దాకా వేచి చూడాల్సిందే..
 

38
Image credit: PTI

కెఎల్ రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, మొదటి రెండు మ్యాచులు ఆడకపోయినా సూపర్ 4 రౌండ్‌లో అతను బరిలో దిగుతాడని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కామెంట్ చేశాడు. దీంతో నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీని ఆడించాలని సలహా ఇచ్చాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
 

48
Image credit: PTI

వన్డేల్లో నాలుగో స్థానంలో  విరాట్ కోహ్లీకి మంచి రికార్డే ఉంది. 42 వన్డేల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ, 7 సెంచరీలు, 55.21 యావరేజ్‌తో 1767 పరుగులు చేశాడు. అయితే వన్డే వరల్డ్ కప్‌లో విరాట్‌ని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి పంపడం కరెక్ట్ కాదంటున్నాడు సంజయ్ మంజ్రేకర్..
 

58
Image credit: PTI

‘నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో లేకుంటే ఇషాన్ కిషన్‌ని ఆడించొచ్చు. అంతేకానీ విరాట్ కోహ్లీని ఆడించడం కరెక్ట్ కాదు. అది అతన్ని బలపశువుగా మార్చినట్టు అవుతుంది...
 

68
Image credit: Getty

ఎందుకంటే విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సమయంలో అతని బ్యాటింగ్ పొజిషన్‌ని మార్చకపోవడమే టీమిండియాకి మంచిది. 2007 వరల్డ్ కప్ సమయంలో ఇలాగే జరిగింది. 

78

రాహుల్ ద్రావిడ్, గ్రెగ్ ఛాపెల్ కలిసి సచిన్ టెండూల్కర్‌ని ఓపెనర్‌గా కాకుండా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి పంపారు..టాపార్డర్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడని సచిన్‌ని నాలుగో స్థానంలో పంపడం టీమిండియా చావుదెబ్బ తీసింది. 

88

ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలో అలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకపోవడం టీమిండియాకి చాలా మంచిది. అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటాడో ఆ పొజిషన్ అతనికి ఇవ్వండి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. 

Read more Photos on
click me!

Recommended Stories