విరాట్ కోహ్లీ, పూజారా, రహానే, గిల్ కంటే అశ్విన్ చాలా బెటర్... అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లో...

First Published | Nov 28, 2021, 2:03 PM IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం దక్కిందనే సంతోషం కాసేపు కూడా నిలవకుండానే రెండో ఇన్నింగ్స్‌‌లో వరుస వికెట్లు కోల్పోయింది టీమిండియా...

యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 1, ఛతేశ్వర్ పూజారా 22, అజింకా రహానే 4, మయాంక్ అగర్వాల్ 17 పరుగులు చేసి అవుట్ కాగా రవీంద్ర జడేజా డకౌట్ అయ్యాడు...

నాలుగో రోజు ఉదయం సెషన్‌లో వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాను రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి 52 పరుగుల అమూల్య భాగస్వామ్యాన్ని నెలకొల్పారు...


62 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, కేల్ జెమ్మీసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే అశ్విన్ చేసిన పరుగులు ఎంతో అమూల్యమైనవి...

తొలి ఇన్నింగ్స్‌లో 56 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, జట్టులో ఉన్న సీనియర్ బ్యాట్స్‌మెన్ పూజారా, రహానే, యంగ్ బ్యాట్స్‌మెన్ మయాంక్, శుబ్‌మన్ గిల్ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు...

2021 సీజన్‌లో 7 టెస్టులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 12 ఇన్నింగ్స్‌ల్లో 337 పరుగులు చేశాడు. ఇందులో చెన్నై టెస్టులో చేసిన సెంచరీ కూడా ఉంది..

ఈ ఏడాది 30.63 యావరేజ్‌తో ఓ టెస్టు సెంచరీ కూడా చేశాడు రవిచంద్రన్ అశ్విన్. స్వదేశంలో రోహిత్ శర్మ (345), రిషబ్ పంత్ (270) తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా టాప్ 3లో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్ (258)...

 భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పూజారా, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, అజింకా రహానే ఎవ్వరూ కూడా రవిచంద్రన్ అశ్విన్‌లా పరుగులు చేయలేకపోయారు...

గత రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన ఛతేశ్వర్ పూజారా, 2021 సీజన్‌లో 30.42 సగటుతో ఓవరాల్‌గా పరుగులు చేయగా, స్వదేశంలో పూజారా చేసిన పరుగులు 181 మాత్రమే...

పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అజింకా రహానే, 19.57 సగటుతో పరుగులు చేయగా, ఈ ఏడాది స్వదేశంలో 151 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, 2021 సీజన్‌లో స్వదేశంలో ఆడిన నాలుగు టెస్టుల్లో 172 పరుగులు చేశాడు. ఈ ఏడాది కోహ్లీ టెస్టు యావరేజ్ 29.80 మాత్రమే...

శుబ్‌మన్ గిల్ ఈ ఏడాది 27.64 సగటుతో పరుగులు చేయగా, స్వదేశంలో ఈ యంగ్ ఓపెనర్ 172 పరుగులు చేసి విరాట్‌తో సమానంగా నిలిచాడు...

స్టార్ బ్యాట్స్‌మెన్‌గా కీర్తించబడుతున్న విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూాజారా, అజింకా రహానే, శుబ్‌మన్ గిల్ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేస్తూ, అటు బౌలింగ్‌లోనూ అదరగొడుతూ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా మారాడు రవిచంద్రన్ అశ్విన్.

Latest Videos

click me!