వద్దు, నన్ను సెలక్ట్ చేయకండి... సెలక్టర్లకు హార్ధిక్ పాండ్యా రిక్వెస్ట్, సౌతాఫ్రికా టూర్ విషయంలో...

First Published Nov 28, 2021, 1:19 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు నుంచే టీమ్‌లో హార్ధిక్ పాండ్యా ప్లేస్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఆల్‌రౌండర్‌గా వన్డే, టీ20ల్లో చోటు దక్కించుకున్న హార్ధిక్ పాండ్యా, గత రెండేళ్లుగా బంతితో పర్ఫెక్ట్‌గా రాణించింది లేదు...

వెన్ను గాయం కారణంగా క్రికెట్‌కి దూరమై, శస్త్రచికిత్స తర్వాత దాదాపు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకుని... రీఎంట్రీ ఇచ్చాడు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా...

అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో, శ్రీలంక పర్యటనలో బౌలింగ్ చేశాడు... 

అయితే వెన్ను గాయం కారణంగా బౌలింగ్ చేయడానికి ఇబ్బందిపడిన హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేకపోయాడు...

అయితే మెంటర్ ఎమ్మెస్ ధోనీ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చోటు దక్కించుకున్న హార్ధిక్ పాండ్యా... పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌కి రాలేదు...

ఆ తర్వాత న్యూజిలాండ్‌, ఆఫ్ఘానిస్తాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌లతో జరిగిన మ్యాచుల్లో బరిలో దిగిన హార్ధిక్ పాండ్యా... ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో బ్యాటుతో కొన్ని మెరుపులు మెరిపించడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదు.

నాలుగు మ్యాచుల్లో బౌలింగ్ చేసిన హార్ధిక్ పాండ్యా 10 ఎకానమీతో పరుగులు సమర్పించడమే కాకుండా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు...

ఈ పర్ఫామెన్స్ కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో హార్ధిక్ పాండ్యాకి చోటు దక్కలేదు. పేలవ ప్రదర్శన కారణంగా పాండ్యాను జట్టు నుంచి తప్పించింది టీమిండియా...

అయితే సీనియర్ ఆల్‌రౌండర్‌ కావడం, సౌతాఫ్రికాలో హార్ధిక్ పాండ్యాకి మంచి రికార్డు ఉండడంతో సఫారీ టూర్‌కి ముందు ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది బీసీసీఐ...

అయితే హార్ధిక్ పాండ్యా మాత్రం సౌతాఫ్రికా టూర్‌లో పాల్గొనడానికి ఇష్టపడడం లేదట. తనని సఫారీ టూర్‌కి ఎంపిక చేయకండంటూ సెలక్టర్లకు పాండ్యా సూచించినట్టు సమాచారం...

2018లో చివరి టెస్టు ఆడిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత మూడేళ్లుగా టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆసీస్ టూర్‌లో టీ20, వన్డేల్లో అదరగొట్టిన హార్ధిక్ పాండ్యా, టెస్టుల్లో ఆడడానికి మాత్రం ఇంట్రెస్ట్ లేదంటూ తేల్చేశాడు...

అయితే వికెట్లు తీయలేకపోవడం, బౌలింగ్ యాక్షన్‌ మెరుగుపడకపోవడంతో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న హార్ధిక్ పాండ్యా, కొంత కాలం క్రికెట్‌కి దూరంగా ఉండి పూర్తి ఫిట్‌నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నాడట...

హార్ధిక్ పాండ్యా గైర్హజరీతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్‌కి సౌతాఫ్రికా టూర్‌లో మరో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఐపీఎల్ 2020 సీజన్‌లో 281 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, 2021 సీజన్‌లో అయితే 127 పరగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచింది...

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు, హార్ధిక్ పాండ్యాని రిటైన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం...

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, కిరన్ పోలార్డ్‌లను అట్టిపెట్టుకోవాలని భావిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు, సూర్యకుమార్ యాదవ్ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. 

click me!