టీమిండియా ఆ ఇద్దరినీ నమ్మలేదు, అందుకే విరాట్ కోహ్లీ అలా తప్పుకున్నాడు... ఇంజమామ్ వుల్ హక్ షాకింగ్ కామెంట్స్..

First Published Nov 28, 2021, 12:30 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ చేసిన ప్రకటన,పెను సంచలనం క్రియేట్ చేసింది. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ ఆరంభానికి ముందే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం వెనక చాలా పెద్ద రహస్యమే దాగి ఉందని  అంటున్నాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్...

టీమిండియా హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు పూర్తి కాలం, రాహుల్ ద్రావిడ్ కొత్త కోచ్‌గా రాబోతున్నట్టు వార్తలు రావడంతోనే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు ఇంజమామ్ వుల్ హక్..

‘టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ భావించి ఉంటే, ఆ విషయాన్ని ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత ప్రకటించాల్సింది. అలా కాకుండా ముందే చెప్పడం కరెక్ట్ కాదు..

టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ ఆడే ముందు కెప్టెన్ ఇలాంటి ప్రకటన చేస్తే, ఆ ప్రభావం టీమ్ పర్ఫామెన్స్‌పై పడుతుంది. ఆ విషయం విరాట్ కోహ్లీకి తెలియనిది కాదు..

hli

అయినా విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటే అతను ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. వాళ్లందరికీ టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రావిడ్ వస్తాడని తెలుసు...

విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలతో టీమిండియా క్రికెట్ బోర్డుకి విభేదాలు ఉన్నాయో, లేక ఆ ఇద్దరికీ బీసీసీఐతో సత్సంబంధాలు లేవో నాకైతే తెలీదు... 

ఒకవేళ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ టైటిల్‌ను టీమిండియా గెలిచి ఉంటే, విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పేంచేవాళ్లా? రవిశాస్త్రి స్థానంలో కొత్త హెడ్‌ కోచ్‌ని తెచ్చేవాళ్లా?

నాకైతే టీమిండియా క్రికెట్ బోర్డు, డ్రెస్సింగ్ రూమ్‌లో లుకలుకలు ఉన్నట్టు అనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్...

రాహుల్ ద్రావిడ్ హెడ్‌కోచ్‌గా, రోహిత్ శర్మ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన మొట్టమొదటి టీ20 సిరీస్‌లోనే న్యూజిలాండ్‌‌ను క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు...

టీ20 కెప్టెన్‌గా వరుసగా 9 సిరీస్‌లు, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో టీ20 సిరీస్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఐసీసీ టైటిల్ లేకుండా పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ తప్పుకున్నాడు..

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలో దిగనుంది టీమిండియా. రోహిత్, రాహుల్ ద్రావిడ్ జోడీపై భారీ అంచనాలున్నాయి. 

click me!