అనిల్ కుంబ్లే ఆ రికార్డును అధిగమించిన అశ్విన్... స్వదేశంలో 300 వికెట్లతో...

First Published Dec 6, 2021, 11:03 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతుల్లో ఎదురైన పరాభవానికి స్వదేశంలో ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ముంబై టెస్టులో 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని, టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది...

తొలి ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లలో 2 మెయిడిన్లతో 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లోనూ కివీస్ పతనాన్ని శాసించాడు...

22.3 ఓవర్లలో 9 మెయిడిన్లతో 34 పరుగులిచ్చిన రవిచంద్రన్ అశ్విన్, 4 వికెట్లు పడగొట్టాడు. కివీస్ కోల్పోయిన మొదటి మూడు వికెట్లతో పాటు ఆఖరి వికెట్ కూడా అశ్విన్ తీసినదే...

ముంబై టెస్టులో దక్కిన 372 పరుగుల తేడా భారత జట్టుకి అతి పెద్ద విజయం... ఇంతకుముందు 2015లో సౌతాఫ్రికాపై 337 పరుగుల తేడాతో గెలవడమే అతిపెద్ద విజయంగా ఉండేది...

న్యూజిలాండ్‌కి ఇదే అతి పెద్ద పరాజయం. ఇంతకుముందు 2007లో సౌతాఫ్రికాలో 358 పరుగుల తేడాతో ఓడడమే కివీస్‌కి అతిపెద్ద పరాజయంగా ఉండేది...

ముంబై టెస్టులో 8 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, స్వదేశంలో 300 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మాత్రమే (350 వికెట్లు) అశ్విన్ కంటే ముందున్నాడు...

అత్యంత వేగంగా స్వదేశంలో 300 వికెట్లు తీసిన బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ తర్వాతి స్థానంలో నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్... 

మురళీధరన్ 48 మ్యాచుల్లో ఈ ఫీట్ అందుకోగా, అశ్విన్ 49 మ్యాచుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. 52 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించిన అనిల్ కుంబ్లేని అశ్విన్ అధిగమించాడు...

టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం ఆరుగురు మాత్రమే స్వదేశంలో 300+ వికెట్లు తీశారు. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్), అనిల్ కుంబ్లే (భారత్), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా...ఇప్పుడు ఆ జాబితాలో అశ్విన్ కూడా చేరాడు.

ఓడిన మ్యాచుల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ అజాజ్ పటేల్ టాప్‌లో నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 14 వికెట్లు తీసిన అజాజ్ పటేల్, 1999లో జవగళ్‌ శ్రీనాథ్, పాక్‌పై తీసిన 13 వికెట్లను అధిగమించాడు...

1988లో చివరిగా వాంఖడే స్టేడియంలో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్, 12 పర్యటనల్లోనూ ఒక్క టెస్టు విజయం కూడా అందుకోలేకపోయింది...

click me!