ఆ ఇద్ద‌రు క్రికెట‌ర్లు ఇష్ట‌మ‌ట‌.. ! జాన్వీ కపూర్ అభిమాన క్రికెటర్ ఎవ‌రంటే..?

First Published | Mar 6, 2024, 2:36 PM IST

Janhvi Kapoor favorite cricketer: మెగా క్రికెట్ టోర్నీ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్ ప్రియులు దీని కోసం మ‌రింత ఆస‌క్తిగా ఎదురుచూస్తూ.. తమ అభిమాన క్రికెట‌ర్లు, టీమ్స్ ను స‌పోర్టు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 
 

Janhvi Kapoor, Virat Kohli,

Janhvi Kapoor favorite cricketer: బాలీవుడ్ తార‌లు సైతం ఐపీఎల్ టీమ్స్ తో పాటు తామ అభిమాన క్రికెట‌ర్ల గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తనకు నచ్చిన ఇద్దరు భారతీయ క్రికెటర్ల గురించి సమాచారం ఇచ్చింది. వారిద్ద‌రి పేర్ల‌ను జాన్వీనే స్వ‌యంగా వెల్ల‌డించింది.

టీమిండియా  స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఇటీవ‌ల త‌మ రెండో బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికారు. అనుష్క శర్మ ఫిబ్రవరి 15న మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని కింగ్ కోహ్లీ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. త‌మ బిడ్డ‌కు అకాయ్ అని పేరు పెట్టినట్టు తెలిపాడు.


ఈ క్ర‌మంలోనే జాన్వీ కపూర్‌ చేసిన ప్రకటన వైరల్‌ అవుతోంది. ప్రముఖ నటి దివంగత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్‌లను తన అభిమాన ఆటగాళ్లుగా పేర్కొంది.

అంత‌కుముందు కూడా ఒక మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ.. భారత జట్టులో తన ఫేవరెట్ క్రికెటర్ పేరు చెప్పమని అడిగినప్పుడు జాన్వీ, "నాకు విరాట్ సర్ అంటే ఇష్టం, అలాగే, డీకే (దినేష్ కార్తీక్) కూడా ఇష్టం. కార్తీక్ ఎందుకంటే అతను కష్టపడి పనిచేయడం నేను చూశానన‌ని చెప్పారు. కాగా, 'మిస్టర్ అండ్ మిసెస్ మ‌హీ' షూటింగ్‌లో ఉన్నప్పుడు జాన్వీకి సరైన క్రికెట్ షాట్లు, వికెట్లు మ‌ధ్య ఎలా ఆడాలో శిక్షణ ఇచ్చాడు దినేష్ కార్తీక్.

కాగా, ఐపీఎల్ 2024 మొదటి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విడుదల చేసింది. తొలి మ్యాచ్ బెంగళూరు-చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య మధ్య మార్చి 22న జరగనుంది. ఈ ప్రారంభ మ్యాచ్‌లో 38 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ బెంగళూరు తరఫున ఆడనున్నారు. చెన్నై ధోని సార‌థ్యంలో ఆట‌ను కొన‌సాగించ‌నుంది. 

విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ లు త‌న అభిమాన క్రికెట‌ర్లుగా పేర్కొన్న జ‌న్వీ క‌పూర్.. వారిద్ద‌రితో పాటు బెంగ‌ళూరు టీమ్ కు స‌పోర్టు చేయ‌నుంద‌ని చెప్ప‌క‌నే చెప్పింది. 

Latest Videos

click me!