అప్పుడు అవకాశాలు ఇవ్వలేదు, ఇప్పుడు అతనే బెస్ట్ అంటూ.. సంజూ శాంసన్‌పై రవిశాస్త్రి...

Published : Jun 09, 2022, 03:11 PM IST

సంజూ శాంసన్... ఏడేళ్ల క్రితం టీమిండియాలోకి వచ్చిన వికెట్ కీపర్. అయితే ఇప్పటిదాకా సంజూ శాంసన్ ఆడింది 13 టీ20లు, ఓ వన్డే మాత్రమే. ఇంతకుముందు ఎమ్మెస్ ధోనీ, ఇప్పుడు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌ల కారణంగా సంజూ శాంసన్‌కి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదు...

PREV
19
అప్పుడు అవకాశాలు ఇవ్వలేదు, ఇప్పుడు అతనే బెస్ట్ అంటూ.. సంజూ శాంసన్‌పై రవిశాస్త్రి...
Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్, టీమ్‌ని 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేర్చగలిగాడు. అయితే ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడిన రాయల్స్, రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది...

29

ఐపీఎల్‌‌లో గత ఆరు సీజన్లలో 300+ పరుగులు చేసిన సంజూ శాంసన్, కెప్టెన్‌గా 2021 సీజన్‌లో 484 పరుగులు, 2022 సీజన్‌లో 458 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయినా అతనికి సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చోటు ఇవ్వలేదు సెలక్టర్లు...

39

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి టీమ్‌ని ఎంపిక చేసే ఉద్దేశంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ జట్టును ప్రిపేర్ చేసింది బీసీసీఐ. దీంతో సంజూ శాంసన్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు దక్కకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...
 

49
Sanju Samson

అయితే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఆస్ట్రేలియాలో జరిగే పొట్టి ప్రపంచకప్‌ టోర్నీలో సంజూ శాంసన్ ఉండాల్సిందేనని అంటున్నాడు. మిగిలిన బ్యాటర్ల కంటే శాంసన్ చాలా షాట్స్ ఆడగలడని కామెంట్లు చేశాడు...

59
Ravi Shastri , Sanju Samson

‘ఐపీఎల్‌లో ఆడిన మ్యాచుల్లో 100 శాతం పర్పామెన్స్ చూపించిన వాళ్లు ఎవ్వరైనా ఉన్నారంటే అది రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్. మిగిలిన వారి కంటే వీళ్లు ఎక్కువ కష్టపడ్డారు. కాబట్టి వీళ్లకు ఛాన్స్ ఇవ్వాల్సిందే...

69

తిలక్ వర్మ కూడా చాలా బాగా ఆడాడు. అయితే ఆస్ట్రేలియాలో పిచ్ కండీషన్స్ భిన్నంగా ఉంటాయి. అక్కడ బౌన్స్, పేస్, కట్, పుల్... ఇలాంటి షాట్స్‌ని ఆడగల సంజూ శాంసన్ అయితే అక్కడ అదరగొట్టగలడు..

79
Sanju Samson

సంజూ శాంసన్ దగ్గర మిగిలిన భారత క్రికెటర్ల కంటే ఎక్కువ షాట్స్ ఉన్నాయి. అతను ఎలాంటి పిచ్‌లో అయినా ఆడగలడు. ప్లాట్ పిచ్‌ల కంటే బౌన్సీ పిచ్‌లపై మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించగలడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

89
Sanju Samson

అయితే రవిశాస్త్రి వ్యాఖ్యలపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో సంజూ శాంసన్‌కి పెద్దగా అవకాశాలు ఇచ్చింది లేదు. శాంసన్‌ని కాదని, రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించూ వచ్చారు...

99

రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో సంజూ శాంసన్‌కి భారత జట్టులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. కాదనకుండా అరకోర మ్యాచుల్లో అవకాశం ఇచ్చి, ఫెయిల్ అయ్యాడని పక్కనబెట్టేసేవాళ్లు... హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో పట్టించుకోకుండా ఇప్పుడు సంజూ శాంసన్ అయితే అన్ని షాట్లు ఆడగలడని చెప్పడం ఎంత వరకూ కరెక్ట్ అంటున్నారు అభిమానులు...

click me!

Recommended Stories