Mithali Raj retirement: బుధవారం (జూన్ 8న) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ భారత మహిళల క్రికెట్ లో ఓ లెజెండ్. తన ఆటతోనే కాదు అవసరమొస్తే మాటతో కూడా దూసుకుపోయేది.
భారత మహిళా క్రికెట్ దిగ్గజం, బుధవారం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్ తన ఆటతో శిఖరాగ్ర స్థాయికి చేరింది. మహిళా క్రికెట్ కు అంతగా ఆదరణ లేని రోజుల్లోనే ఆమె ఈ ఆటను కెరీర్ గా ఎంచుకోవడమే గాక ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.
26
అయితే ఆటతోనే కాదు.. తన ఆత్మాభిమానానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా అంటే ఆమె అక్కడికక్కడే నిలదీసేది. ఆటతో పాటు మాటతో కూడా గట్టిగానే సమాధానమిచ్చేది.
36
కెరీర్ ఆరంభంలో ఆమెకు ఎదురైన అనుభవాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే.. మహిళ అనే కారణంగా తనపై వివక్ష చూపిన ఓ పాత్రికేయుడికి తనదైన సమాధానమిచ్చింది మిథాలీ.
46
2017 లో ఆమెతో మాట్లాడిన ఓ రిపోర్టర్.. ‘మీ ఫేవరేట్ మేల్ క్రికెటర్ పేరు చెప్పండి..?’ అని ప్రశ్నించాడు. దీనికి మిథాలీ దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది.
56
మిథాలీ స్పందిస్తూ..‘మీరు ఇదే ప్రశ్నను ఓ మేల్ క్రికెటర్ ను అడుగుతారా..? వాళ్లకు బాగా నచ్చిన ఫిమేల్ క్రికెటర్ ఎవరని ప్రశ్నిస్తారా..?’ అని నిలదీసింది. దీంతో సదరు పాత్రికేయుడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
66
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మిథాలీకి మద్దతుగా నిలిచింది. ‘చాలా భాగా అడిగావ్ మిథాలీ.. వెల్ డన్’ అని ప్రశంసలు కురిపించింది. ఇక భారత్ తరఫున సుదీర్ఘకాలం ఆడిన మిథాలీ.. 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 లలో కలిపి మొత్తంగా 10,868 పరుగులు చేసింది.