అంబటి రాయుడు కావాలని ఆయన అడగలేదు, 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో... రవిశాస్త్రి కామెంట్లపై...

First Published Dec 14, 2021, 3:21 PM IST

2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో టీమిండియా ప్లేయర్ల సెలక్షన్ విషయంలో నానా రచ్చ జరిగిన విషయం తెలిసిందే. నాలుగో స్థానంలో రాణిస్తున్న అంబటి రాయుడిని కాదని, ముగ్గురు వికెట్ కీపర్లను ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది...

2019 వన్డే వరల్డ్‌కప్‌కి ముందు భారత జట్టులో కీ ప్లేయర్‌గా మారి, నాలుగో స్థానంలో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చాడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు..

అయితే వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీకి అంబటి రాయుడిని కాదని, విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో టీమిండియా మూడు విధాలుగా ఉపయోగపడతాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కామెంట్ చేశారు...

తనకు వరల్డ్ కప్ టోర్నీలో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన అంబటి రాయుడు, టీమిండియా మ్యాచులు చూసేందుకు ‘త్రీడీ గ్లాసెస్’ ఆర్డర్ చేశానంటూ వేసిన ట్వీట్, పెద్ద రచ్చే లేపింది...

తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై చేసిన కామెంట్లు కూడా తెగ వైరల్ అయ్యాయి... ‘2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి అంబటి రాయుడిని ఎంపిక చేయాల్సింది...

నాలుగో స్థానంలో సరైన ప్లేయర్ లేక టీమిండియా ఇబ్బంది పడుతుంటే ఎమ్మెస్ ధోనీ, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌ల రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లను ఎంపిక చేశారు...

వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన టీమ్‌లో ముగ్గురు వికెట్ కీపర్లు ఎందుకు దండగ? సెలక్టర్ల ఆలోచనేంటో అర్థం కాలేదు...’ అంటూ కామెంట్లు చేశాడు రవిశాస్త్రి...

తాజాగా రవిశాస్త్రి కామెంట్లపై అప్పటి సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న మాజీ క్రికెటర్ శరణ్‌దీప్ సింగ్ స్పందించాడు. ‘రవిశాస్త్రి, టీమిండియాకి హెడ్ కోచ్‌గా ఉన్నాడు. సెలక్షన్ మీటింగ్‌లో అతనేం చెప్పలేదు...

అయితే సెలక్షన్ కమిటీ, ప్లేయర్లను సెలక్ట్ చేసిన తర్వాత కెప్టెన్‌తో, హెడ్ కోచ్‌తో చర్చించేవాళ్లం. వారిని ఎంపిక చేయడానికి కారణమేంటో చెప్పేవాళ్లం, అలాగే వారికేం కావాలో అడిగేవాళ్లం...

అయితే వాళ్లెప్పుడూ ఈ ప్లేయర్ కావాలని అడగలేదు. అయినా గత కొన్నేళ్లుగా భారత జట్టు అన్ని ద్వైపాక్షిక సిరీసుల్లోనూ గెలుస్తూ వస్తోంది. సెలక్షన్ సరిగా లేకపోతే విజయాలు ఎలా వస్తున్నాయి...

అంబటి రాయుడిని ఆడించాలని రవిశాస్త్రి అనుకుంటే విరాట్ కోహ్లీతో చెప్పొచ్చు, ఒకవేళ కోహ్లీకి ఆ ప్లేయర్‌ని ఆడించడం ఇష్టం లేకపోతే మాతో చర్చించవచ్చు...

అయితే గత నాలుగేళ్లలో రవిభాయ్ ఎప్పుడూ ఈ విషయం గురించి చెప్పలేదు. ఆయన మంచి కోచ్. మేం చెప్పినవాటిని శ్రదర్ధగా వినేవాళ్లు. సెడన్‌గా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు శరణ్‌దీప్ సింగ్...

click me!