2022, డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటూ, డాక్టర్లను కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. తాను కోలుకుంటున్న విధానం గురించి ప్రతీ అప్‌డేట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు..
అప్పుడెప్పుడో గత ఏడాది ఆసియా కప్‌కి ముందు గాయపడిన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్ గురించి మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. జస్ప్రిత్ బుమ్రా ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడనే విషయం గురించి రోజుకో వార్త వినిపిస్తోంది...
27
Jasprit Bumrah
వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్‌కి వెళ్లే భారత జట్టు, ఆగస్టులో టీ20 సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే టీమిండియా, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లో బుమ్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది..
37
KL Rahul
అలాగే ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కెఎల్ రాహుల్, ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిటేషన్ తీసుకుంటున్నాడు. మే నెలలో ఇంగ్లాండ్‌లో కెఎల్ రాహుల్‌కి సర్జరీ జరిగింది...
47
సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌లో కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. అయితే అతను ఆసియా కప్ సమయానికి పూర్తిగా కోలుకోవడం అనుమానమేనని సమాచారం.. దీంతో వన్డే వరల్డ్ కప్‌లో రాహుల్ ఆడతాడా? లేదా? అనే విషయంలోనూ క్లారిటీ రాలేదు..
57
Shreyas Iyer
వీరితో పాటు వెన్నెముక గాయంతో బాధపడుతూ టీమ్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ రావడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు..
67
Shreyas Iyer
‘ఎన్‌సీఏలో శ్రేయాస్ అయ్యర్ వెన్నెముకకి ఇంజక్షన్ ఇచ్చాం. అయితే అతను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోతున్నాడు. అయ్యర్ వెన్నునొప్పికి కారణం ఏంటో తెలియడం లేదు. ఆసియా కప్ టోర్నీలో అతను ఆడడం అనుమానమే...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి తెలియచేశారు.
77
చూస్తుంటే వన్డే వరల్డ్ కప్ 2023 సమయానికి కూడా శ్రేయాస్ అయ్యర్ కోలుకోవడం కష్టమే. దీంతో విండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌లో వన్డే ఫార్మాట్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్, లేదా రుతురాజ్ గైక్వాడ్‌ని నాలుగో స్థానంలో ఆడించనుంది బీసీసీఐ.