విరాట్ కోహ్లీ, కపిల్‌దేవ్ లాంటోడు.. రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్ లాంటోడు... రవిశాస్త్రి కామెంట్స్...

Published : Dec 27, 2021, 07:43 PM IST

టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత తిరిగి కామెంటేటర్‌గా తన పాత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. టీమిండియా డైరెక్టర్‌గా, హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు తన అనుభవాలను ఒక్కొక్కటిగా బయటికి వదులుతున్నాడు...

PREV
17
విరాట్ కోహ్లీ, కపిల్‌దేవ్ లాంటోడు.. రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్ లాంటోడు... రవిశాస్త్రి కామెంట్స్...

టీమిండియాలో ఇద్దరు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య కెప్టెన్సీ గురించి వివాదం రేగిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

27

విరాట్ కోహ్లీ, 2023 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీ వరకూ వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించినా... రోహిత్ శర్మ వన్డే, టీ20 ఫార్మాట్లు రెండింట్లో కెప్టెన్సీ అప్పగిస్తేనే పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతలు తీసుకుంటానని డిమాండ్ చేశాడని టాక్ వినిపించింది...

37

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ద్వైపాక్షిక సిరీసుల్లో మూడు ఫార్మాట్లలోనూ సూపర్ సక్సెస్ అయినా, ఐసీసీ టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. ఐపీఎల్ టైటిల్ కూడా విరాట్ కెరీర్ లేకపోవడం, అతని కెప్టెన్సీ పోవడానికి కారణమైంది...

47

‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీని పోల్చి చూడాలంటే, నాకు కపిల్‌ దేవ్, సునీల్ గవాస్కర్ గుర్తుకువస్తారు. విరాట్ కెప్టెన్సీ కపిల్‌ దేవ్‌లా అనిపిస్తుంటుంది. అదే రోహిత్ సారథ్యం గవాస్కర్‌లా ఉంటుంది... ’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...

57

‘నాకు, విరాట్ కోహ్లీకి పర్సనాలిటీ బాగా సింక్ అయ్యింది. అతను కూడా నాలాగే బాగా అగ్రెసివ్, మేం ఇద్దరం కూడా గెలవాలనే ఆడతాం కానీ డ్రా కోసం ప్రయత్నించాలని చూడం....

67

నేను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో విజయాలు అందుకోవాలంటే 20 వికెట్లు తీయడమే మార్గమని గ్రహించాం. వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్లను వెతికి పట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాం...

77

నిర్భయంగా, దూకుడుగా ఆడితే ఎక్కడైనా విజయాలు అందుకోగలమని తెలుసుకున్నాం... అదే ఫార్ములాతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో విజయాలు అందుకున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...

Read more Photos on
click me!

Recommended Stories