ఫిట్‌నెస్ లేదు, స్పెల్లింగ్ కూడా రాదు, అయినా ఆ పనిలో మాత్రం... హార్ధిక్ పాండ్యాను ట్రోల్ చేస్తున్న...

Published : Dec 27, 2021, 06:33 PM IST

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మరోసారి ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. 2021 టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో మెంటర్ ఎమ్మెస్ ధోనీ రిఫరెన్స్‌తో చోటు దక్కించుకున్న పాండ్యా, ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటుతో మెరుపులు తప్ప పెద్దగా రాణించింది లేదు...

PREV
19
ఫిట్‌నెస్ లేదు, స్పెల్లింగ్ కూడా రాదు, అయినా ఆ పనిలో మాత్రం... హార్ధిక్ పాండ్యాను ట్రోల్ చేస్తున్న...

పేలవ ఫామ్ కారణంగా టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత జరిగిన న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేయలేదు టీమిండియా సెలక్టర్లు...

29

హార్ధిక్ పాండ్యా రెండేళ్లుగా సరైన ఫిట్‌నెస్ సాధించలేకపోతున్నాడు. అప్పుడెప్పుడో 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో గాయపడి, వెన్నెముక సర్జరీ కూడా చేయించుకున్న హార్ధిక్ పాండ్యా... ఇప్పటికీ బౌలింగ్ చేయలేకపోతున్నాడు...

39

తాజాగా క్రిస్‌మస్ సందర్భంగా విషెస్ తెలుపుతూ హార్ధిక్ పాండ్యా చేసిన పోస్టు అతనిపై విమర్శలు రావడానికి కారణమైంది... 

49

‘మేరీ క్రిస్‌మస్’ అంటూ పాండ్యా పోస్టు చేసిన పిక్‌లో Merryకి బదులుగా Marry అని స్పెల్లింగ్ తప్పుగా పెట్టడమే ఈ ట్రోలింగ్ రావడానికి ప్రధాన కారణం...

59

బాలీవుడ్ మోడల్ నటాశాను ప్రేమించి, డేటింగ్ చేసిన హార్ధిక్ పాండ్యా... ఆమెను పెళ్లాడడానికి ముందే ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. దీంతో ‘మేరీ’కి ‘మ్యారీ’కి మధ్య స్పెల్లింగ్ మరిచిపోయి ఉంటాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

69

తాజాగా హార్ధిక్ పాండ్యా పోస్టు చేసిన ఫోటోలను చూస్తుంటే, నటాశా మరోసారి గర్భం దాల్చినట్టు తెలుస్తోంది. దీంతో హార్ధిక్ పాండ్యాపై ట్రోలింగ్ మరింత పెరిగింది...

79

రెండేళ్లుగా బౌలింగ్ చేయడానికి నడుము సహకరించకపోయినా, ఆ విషయంలో మాత్రం హార్ధిక్ పాండ్యా ఫుల్లు ఫామ్‌లో ఉన్నాడని అంటున్నారు నెటిజన్లు...

89

అయితే ట్రోలింగ్‌ను ఏ మాత్రం లెక్కచేయని హార్ధిక్ పాండ్యా, భార్య నటాశా స్టాంకోవిక్‌తో కలిసి హాట్ హాట్ ఫోజులు ఇవ్వడం విశేషం...

99

హార్ధిక్ పాండ్యా, నటాశాలతో పాటు కృనాల్ పాండ్యా, అతని సతీమణి... పాండ్యా బ్రదర్స్ తల్లి కూడా ఈ ఫోటోల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు..

click me!

Recommended Stories