అతడు టెస్టుల్లో వెయ్యి వికెట్లు తీస్తాడు.. టీమిండియా బౌలర్ పై షేన్ వార్న్ ప్రశంసలు

Published : Jan 26, 2022, 04:42 PM IST

Shane Warne Lauds Ashwin:  ప్రపంచ  టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (800) అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ టీమిండియా ఆఫ్ స్పిన్నర్ ఆ రికార్డును బద్దలుకొడతాడంటున్నాడు షేన్ వార్న్..

PREV
110
అతడు టెస్టుల్లో వెయ్యి వికెట్లు తీస్తాడు.. టీమిండియా బౌలర్ పై షేన్ వార్న్ ప్రశంసలు

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్.. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను అతడికి అభిమానినన్న వార్న్.. టెస్టులలో అశ్విన్ వెయ్యి వికెట్లు తీస్తాడని ప్రశంసించాడు. 

210

అశ్విన్ తో పాటు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్  కూడా టెస్టులలో వెయ్యి వికెట్లు తీసే సత్తా ఉందిన  కొనియాడాడు. ఈ ఇద్దరూ తన, శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలుకొడుతారని వార్న్ అభిప్రాయపడ్డాడు.

310

వార్న్ మాట్లాడుతూ.. ‘అశ్విన్ రోజురోజుకూ మెరుగవుతున్నాడు. ఒక ఆటగాడికి అసలైన పరీక్ష విదేశాలకు వెళ్లినప్పుడే ఎదురవుతుంది. విదేశాల్లో మెరుగైన ప్రదర్శనలు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆటగాడిగా మీరేంటో మీకు తెలుస్తుంది. 

410

స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా తాము ఎలా ఆడుతున్నామనేదానిపై మీకు ఒక అవగాహన వస్తుంది. అశ్విన్ ఆ విషయంలో సఫలీకృతుడయ్యాడు. నేను అశ్విన్ కు పెద్ద  అభిమానిని.
 

510

అతడు బౌలింగ్ చేసే విధానం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. తనను తాను మార్చుకుంటూ.. అశ్విన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రతి ఓవర్లో భిన్న రకాలైన బంతులను విసురుతూ అశ్విన్.. తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడు...’ అని అన్నాడు.

610

అంతేగాక..‘అశ్విన్, నాథన్ లియాన్ లు ఆ రికార్డుల (వార్న్, ముత్తయ్య మురళీధరన్ నెలకొల్పిన అత్యధిక టెస్టు వికెట్ల రికార్డులు) ను బ్రేక్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం క్వాలిటీ స్పిన్ బౌలింగ్ ను ఎంత బాగా చూస్తే క్రికెట్ అంత ఆసక్తికరంగా మారుతుంది.

710

నా అభిప్రాయం ప్రకారం ఫాస్ట్ బౌలర్, బ్యాటర్ మధ్య సంగ్రామం పెద్దగా ఆసక్తిగా ఉండదు. మెరుగైన స్పిన్నర్, అద్భుతమైన బ్యాటర్ మధ్య మాత్రం పోరు ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో అయితే ఇది మరింత   బాగుంటుంది. అలా ఉంటే.. టెస్టులలో అశ్విన్  1000 వికెట్లు తీస్తాడని నేను భావిస్తున్నాను. లియాన్ కూడా సాధించాలని కోరుకుంటున్నాను. అలా జరిగితే బాగుంటుంది..’అని అన్నాడు.

810

వార్న్ చెప్పినట్టు వెయ్యి వికెట్లు తీయడం అశ్విన్ కు కష్టమైన పనే.. ప్రస్తుతం అతడు టెస్టులలో 430 వికెట్లతో దేశంలో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. భారత దిగ్గజ  క్రికెటర్ కపిల్ దేవ్ (434 వికెట్లు) ను దాటడానికి అశ్విన్ కు నాలుగు వికెట్లు  కావాలి. భారత్ తరఫున హయ్యస్ట్ వికెట్ టేకర్ గా అనిల్ కుంబ్లే (619 వికెట్లు) ఉన్నాడు.

910

అీశ్విన్ వయసు ఇప్పుడు 35 ఏండ్లు. అతడు మరో మూడేండ్లు క్రికెట్ ఆడతాడని భావించినా.. అనిల్ కుంబ్లే ను దాటడమైతే  ప్రయత్నించొచ్చు గానీ ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు) ను అధిగమించడం అనేది అతిశయోక్తి అవుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. లియాన్ (415 వికెట్లు) పరిస్థితి కూడా అంతే...

1010

ఇదిలాఉండగా అశ్విన్ తో పాటు భారత మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ల పని అయిపోలేదని, వాళ్లు త్వరలోనే తిరిగి పుంజుకుంటారని వార్న్ చెప్పాడు.

click me!

Recommended Stories