జెమ్మీసన్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్... ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు...

Published : Jul 11, 2021, 03:05 PM IST

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు దొరికిన ఖాళీ సమయాన్ని మిగిలిన క్రికెటర్లు అందరూ కుటుంబంతో విహారయాత్రలు చేస్తూ గడిపి వేస్తుంటే, భారత స్టార్ ఆల్‌రౌండర్ అశ్విన్ మాత్రం ప్రాక్టీస్ కోసం వాడుకుంటున్నాడు. నేటి నుంచి ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నాడు రవిచంద్రన్ అశ్విన్...

PREV
18
జెమ్మీసన్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్... ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు...

బీసీసీఐ నుంచి అనుమతి రావడంతో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సుర్రే క్లబ్ తరుపున ఆడబోతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. సోమర్‌సెట్‌తో జరిగే మ్యాచ్‌ కోసం ప్రకటించిన జట్టులో అశ్విన్‌కి చోటు దక్కింది.

28

న్యూజిలాండ్ స్టార్ పేసర్ కేల్ జెమ్మీసన్ గాయం కారణంగా కౌంటీ ఛాంపియన్‌షిప్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో అతని స్థానంలో అశ్విన్, 13 మందితో కూడిన జట్టులో చోటు సంపాదించాడు.

38

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నాలుగు వికెట్లు తీసి, డబ్ల్యూటీసీ టోర్నీ 2019-21 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, తమ జట్టుకి ఓ ఆయుధంలా ఉపయోగతాడని సుర్రే ఆశాభావం వ్యక్తం చేసింది...

48

సుర్రే జట్టులో యంగ్ స్పిన్నర్లు అమర్ విర్దీ, డానియల్ మోరియార్టీలకు మెంటర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉపయోగపడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది...

58

79 టెస్టుల్లో 413 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, నాలుగు సెంచరీలు కూడా సాధించాడు. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది భారత జట్టు...

68

ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో 20 రోజుల హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది భారత జట్టు. డబ్ల్యూటీసీ ఫైనల్ 23న ముగిసిన తర్వాత బయో బబుల్ నుంచి బయటికి వచ్చిన క్రికెటర్లు, ఇంగ్లాండ్‌లో తిరుగుతూ హాలీడేస్ గడుపుతున్నారు..

78

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిష్టాత్మక సుర్రే, సోమర్‌సెట్ మధ్య జరిగే మ్యాచ్ ఆడిన తర్వాత ఈ నెల 21 నుంచి తిరిగి బీసీసీఐ క్యాంపులోకి వచ్చేస్తాడు రవిచంద్రన్ అశ్విన్. 22 నుంచి కౌంటీ జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది భారత జట్టు...

88

డబ్ల్యూటీసీ 2019-21 టోర్నీలో 14 మ్యాచులు ఆడి 71 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్‌ను అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు...

click me!

Recommended Stories