సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ కన్ఫార్మ్... దాదా రోల్‌లో ‘యానిమల్’...

First Published Feb 22, 2023, 3:41 PM IST

భారత క్రికెట్‌ గతిని మార్చిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రముఖుడు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని, భారత జట్టు కష్టకాలం అనుభవిస్తున్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సౌరవ్ గంగూలీ... తన కెప్టెన్సీలో టీమిండయా టాప్ టీమ్‌గా నిలబెట్టాడు. గంగూలీ జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ రూపొందనుంది..

ఏడాది కిందటే తన బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తాడని ప్రకటించాడు సౌరవ్ గంగూలీ. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్‌ వంగాతో ‘యానిమల్’ సినిమాని పూర్తి చేసిన రణ్‌బీర్ కపూర్, త్వరలో ‘దాదా’ బయోపిక్‌కి డేట్స్ ఇవ్వబోతున్నాడు..

సౌరవ్ గంగూలీ సినిమాని మొదలెట్టడానికి ముందు కోల్‌కత్తాలో ఈడెన్ గార్డెన్స్‌లో దాదా సమక్షంలోనే క్రికెట్ ట్రైయినింగ్ తీసుకోబోతున్నాడు రణ్‌బీర్ కపూర్. అలాగే గంగూలీ ఇళ్లు, బారిసా హౌస్, మోహన్ బగన్ క్లబ్ వంటి ప్రదేశాల్లో తిరిగి గంగూలీ గురించి చాలా విషయాలను తెలుసుకోబోతున్నాడట..

Latest Videos


ఇదివరకే బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’ మూవీలో జీవించేసిన రణ్‌బీర్ కపూర్, సౌరవ్ గంగూలీ రోల్‌లో లీనం కావడానికి కసరత్తులు మొదలెట్టేశాడు.... సంజూ మూవీని డైరెక్ట్ చేసిన రాజ్‌కుమార్ హిరాణీయే ‘దాదా’ మూవీని డైరెక్ట్ చేస్తాడని టాక్ వినబడుతుండగా, తన బయోపిక్‌ని ఎల్‌యూవీ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తుందని గంగూలీ ఇది వరకే ప్రకటించాడు. 

బాలీవుడ్‌లో ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ (ఎమ్మెస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ), సచిన్ టెండూల్కర్ - (సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్), మహ్మద్ అజారుద్దీన్  (అజర్) , మొట్టమొదటి వరల్డ్‌కప్ హీరో కపిల్‌దేవ్ బయోపిక్ (83), ప్రవీణ్ తాంబే (కౌన్ హై ప్రవీణ్ తాంబే), మిథాలీరాజ్ (శభాష్ మిథూ).. బయోపిక్స్ వచ్చాయి. వీటిలో కొన్ని బాక్సాఫీస్ దగ్గర అదరగొడితే, మరికొన్ని కమర్షియల్‌గా సక్సెస్ సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి...

Sourav Ganguly

‘బెంగాల్ టైగర్’గా, ‘ప్రిన్స్ ఆఫ్ బెంగాల్’, ‘దాదా’గా అభిమానుల మనసులు గెలుచుకున్న సౌరవ్ గంగూలీ, ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే ప్రఖ్యాత లార్డ్స్‌లో భారీ సెంచరీ చేసి, అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు...

కెప్టెన్‌గా టీమిండియా 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేర్చిన సౌరవ్ గంగూలీ, 2002లో నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత లార్డ్స్ బాల్కనీలో షర్టు విప్పి సెలబ్రేట్ చేసుకోవడం క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ మరిచిపోలేరు...

గ్రెగ్‌ ఛాపెల్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక కెప్టెన్సీ కోల్పోయి, టీమ్‌లో ప్లేస్ కూడా కోల్పోయిన సౌరవ్ గంగూలీ... దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫామ్ నిరూపించుకుని తిరిగి భారత జట్టులోకి వచ్చాడు.

అంతేనా ప్రేమ, పెళ్లి, నగ్మా ఎఫైర్ ఓ ఎత్తు అయితే.. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకోవడం, విరాట్ కోహ్లీతో విభేదాలు మరో ఎత్తు... ఇలా గంగూలీ జీవితంలో ఓ కమర్షియల్ సినిమాకి కావాల్సినంత మసాలా ఉంది.

మ్యాచ్ ఫిక్సింగ్ రాయుళ్లను భయపెట్టి, విదేశీ క్రికెటర్లతో ఢీ అంటే ఢీ అని మాటకు మాట సమాధానం చెప్పిన సౌరవ్ గంగూలీ... క్రికెట్, వ్యక్తిగత జీవితంలో తెలియని విషయాలు ఈ బయోపిక్‌లో ఎలా చూపిస్తారో చూడాలి.. 

click me!