వరల్డ్‌కప్ గెలిచాకే పెళ్లి చేసుకుంటాడట... రషీద్ ఖాన్ కూడా పెళ్లికాని క్రికెటర్ల జాబితాలో చేరిపోతాడా?

Published : May 24, 2021, 05:34 PM IST

ఆఫ్ఘాన్ సంచలనం రషీద్ ఖాన్, తన బౌలింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడే ఈ యంగ్ సెన్సేషన్, ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 22 ఏళ్ల రషీద్ ఖాన్, తన దేశం ఆఫ్ఘాన్ వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ఎంగేజ్‌మెంట్ కానీ, పెళ్లి కానీ చేసుకుంటానని ప్రకటించాడు.

PREV
110
వరల్డ్‌కప్ గెలిచాకే పెళ్లి చేసుకుంటాడట... రషీద్ ఖాన్ కూడా పెళ్లికాని క్రికెటర్ల జాబితాలో చేరిపోతాడా?

మిగిలినజట్లతో పోలిస్తే ఆఫ్ఘాన్, ఎంట్రీ నుంచే మంచి పర్ఫామెన్స్ ఇస్తోంది. టీ20ల నుంచి వన్డే స్టేటస్ సాధించి, ఇప్పుడు టెస్టుల్లో కూడా రాణిస్తోంది. ఆడిన రెండో టెస్టులోనే విజయం అందుకున్న ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్‌ను ఓడించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

210

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘాన్... వరల్డ్ కప్ గెలిచే జట్టుగా ఎదగాలంటే అంత ఈజీ కాదు. 30 ఏళ్లుగా పసికూనగా పిలువబడుతున్న బంగ్లాదేశ్ కూడా ఇప్పటిదాకా ఆ ఘనత సాధించలేకపోయింది.

310

అదీకాకుండా టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్లను ఓడించే సత్తా ఆఫ్ఘాన్‌కి వచ్చినప్పుడే, వరల్డ్‌కప్ గెలవగలమనే ఆలోచన, ధీమా వారిలో కలుగుతుంది.

410

ఇది జరగాలంటే ఆఫ్ఘాన్ సంచలన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్ఘాన్‌లో రషీద్ ఖాన్‌తో పాటు ఆస్గర్ ఆఫ్ఘాన్, హస్మతుల్లా షాహిదీ, మహ్మద్ నబీ వంటి టాప్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. అయితే వరల్డ్‌కప్ గెలవడమంటే చాలా పెద్ద టాస్క్.

510

అయితే రషీద్ ఖాన్ పెట్టుకున్న టార్గెట్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. వరల్డ్‌కప్ గెలవగలమనే ధీమా, వరల్డ్ కప్ గెలవాలనే కసి ఉంటే చాలు... ఏ జట్టు అయినా అద్భుతాలు చేయగలదు.

610

కాకపోతే పర్సనల్‌ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని లింక్ చేయడమే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి రషీద్ ఖాన్ చెప్పినట్టు వరల్డ్ కప్ గెలిచేదాకా పెళ్లి చేసుకోకుండా బతికేస్తాడా? లేక ఒట్టు తీసి గట్టు మీద పెట్టి తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి పీటలు ఎక్కేస్తాడా చూడాలి...

710

ఒకవేళ రషీద్ ఖాన్, మాట మీద నిలబడాలని గట్టిగా డిసైడ్ చేసుకుంటే... ఆఫ్ఘాన్ వరల్డ్ కప్ గెలిచే సమయానికి రషీద్ ఖాన్‌కి ఎన్నేళ్లు వస్తాయో కూడా ఓ అంచనా వేసుకుంటూ జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు.

810

ఇదిలా ఉంటే భారత సారథి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను రషీద్ ఖాన్ సతీమణిగా చూపించింది గూగుల్ కొన్నాళ్ల కిందట.

910

పెళ్లి సంగతి ఎలా ఉన్నా రాజా ప్యాలెస్‌లా కనిపించే రషీద్ ఖాన్‌ ఇళ్లు చూస్తే, ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే...

1010

2011 నుంచి 2020 మధ్య ప్రదర్శన ఆధారంగా  ఐసీసీ దశాబ్దపు ఉత్తమ టీ20 టీమ్‌లో చోటు దక్కించుకున్న రషీద్ ఖాన్, దశాబ్దపు ఉత్తమ టీ20 ప్లేయర్‌గానూ అవార్డు దక్కించుకున్నాడు.

click me!

Recommended Stories