కరోనాపై పోరాటానికి మరోసారి బీసీసీఐ భారీ సాయం... ఆక్సిజన్ కొరతతో బాధపడేవారికి తక్షణసాయంగా...

First Published May 24, 2021, 3:51 PM IST

కరోనా వైరస్‌పై పోరాటానికి సాయంగా గత ఏడాది 51 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయం చేసిన భారత క్రికెట్ బోర్డు, మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. దేశంలో కరోనా బారిన పడి ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో బాధపడుతున్నవారికి సాయంగా 2 వేల ఆక్సిజన్ కాన్సంటేటర్లు (ఒక్కోటి 10 లీటర్ల కెపాసిటీ) విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించింది.

మార్కెట్ ధర ప్రకారం 10 లీటర్ల ఆక్సిజన్ కాన్సంటేటర్ వాల్యూ రూ.70 వేల నుంచి లక్షా 20 వేల దాకా ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నా బీసీసీఐ చేసిన సాయం విలువ ఎంత లేదన్నా రూ.14 కోట్ల రూపాయలు.
undefined
‘దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నవారికి సాయంగా వీటిని చేరేలా బోర్డు చర్యలు తీసుకుంటుంది. కరోనా విపత్తుతో పోరాడుతున్నవారికి ఇవి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం...’ అంటూ బీసీసీఐ ప్రకటన ద్వారా తెలియచేసింది.
undefined
‘కరోనాపై పోరాటానికి వైద్య, ఆరోగ్య శాఖ ఎంత క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయో బీసీసీఐకి తెలుసు. అయితే వారి పోరాటం ఇలాగే కొనసాగేలా ఈ విభాగాలకి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాం...
undefined
విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను లెక్కచేయకుండా అహర్నిశలు కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి ఎన్ని సార్లు ధన్యవాదాలు తెలిపినా తక్కువే. బీసీసీఐకి కూడా ఆటగాళ్ల ఆరోగ్యమే ప్రధాన అంశం.
undefined
అందుకే తక్షణ సాయంగా ఆక్సిజన్ కాన్సంటేటర్లను అందిస్తున్నాం. కరోనాతో బాధపడే వారంతా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం...’ అంటూ తెలిపాడు బీసీసీఐ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ..
undefined
click me!