ఓ స్వచ్ఛంద సేవా కార్యక్రమం కోసం జరిగిన ఈ ఎగ్జిబిషన్ఫుట్‌బాల్ మ్యాచ్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్. ధోనీ ఎప్పుడూ తన ఫేవరెట్ స్టార్ అంటూ తెలియచేశాడు...
హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఓ యాడ్‌కి అసిస్టెండ్ డైరెక్టర్‌గా పనిచేశాడు రణ్‌వీర్ సింగ్. ‘అప్పుడు నాకు 22 ఏళ్లు ఉంటాయి. ఓ యాడ్‌లో ఎమ్మెస్ ధోనీ నటిస్తున్నారని తెలిసి, నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. కేవలం మాహీ కోసం నేను ఆ పని చేశాను...’ అంటూ చెప్పుకొచ్చాడు రణ్‌వీర్ సింగ్.
‘ఎమ్మెస్‌డీ ప్రపంచంలోనే అతిగొప్ప స్పోర్ట్స్ పర్సన్. ఆయన ఆడుతున్నప్పుడు నేను పుట్టడం నా అదృష్టం. అతనో అద్భుతం. ఓ స్పోర్ట్ ఐకాన్... ఎప్పటికీ ఆయనే నా హీరో...
నా దేశానికి ఎంతో వెలుగు తీసుకొచ్చిన మాహీ భాయ్‌కి థ్యాంక్యూ...’ అంటూ మాహీ రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశాడు రణ్‌వీర్ సింగ్...
ప్రస్తుతం కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో కపిల్‌దేవ్ బయోపిక్ ‘83లో నటిస్తున్న రణ్‌వీర్ సింగ్, ‘ఎప్పుడూ అన్నయ్య పాదాల చెంతనే ఉంటాను’ అంటూ మాహీ కాళ్ల దగ్గర కూర్చున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు..
క్రికెట్ కంటే ముందు ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌ను అలరించాడు...