ఇంగ్లాండ్ టూర్‌కి ఆ ఇద్దరూ... అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ...

First Published Jul 26, 2021, 1:09 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కాకముందే ముగ్గురు ప్లేయర్లు గాయాల కారణంగా దూరం కావడంతో వారి స్థానంలో ఇద్దరు ప్లేయర్లను ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ... పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ.

ఇంగ్లాండ్ టూర్‌లో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కాకముందే ముగ్గురు ప్లేయర్లు గాయాల కారణంగా దూరం కావడంతో వారి స్థానంలో పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లను ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
undefined
ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్... వామప్ మ్యాచ్‌లో గాయపడ్డారు. వీళ్లు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో వారి స్థానంలో రిప్లేస్‌మెంట్ కోరింది టీమ్ మేనేజ్‌మెంట్.
undefined
ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషాతో పాటు అంతర్జాతీయ ఆరంగ్రేటం నుంచి అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
undefined
పృథ్వీషాకి ఇప్పటికే భారత జట్టు తరుపున టెస్టులు ఆడిన అనుభవం ఉండగా సూర్యకుమార్ యాదవ్‌కు ఇదే మొట్టమొదటి టెస్టు టూర్ కానుంది... ఇదే ఏడాది వన్డే, టీ20 ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, త్వరలోనే టెస్టు ఎంట్రీ చేయబోతున్నాడు.
undefined
ఇంగ్లాండ్‌తో సిరీస్ ద్వారా టీ20 ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, శ్రీలంకతో సిరీస్ ద్వారా వన్డే ఆరంగ్రేటం చేశాడు. తొలి వన్డే సిరీస్‌‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన సూర్యకుమార్ యాదవ్‌కి ఇది సువర్ణ అవకాశమే...
undefined
తొలుత స్వింగ్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్‌లను ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలని బీసీసీఐ భావించినప్పటికీ, వాళ్లిద్దరూ టీ20 వరల్డ్‌కప్‌కి ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సమాచారం.
undefined
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి భారత జట్టు ఇది: రోహిత్ శర్మ, పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కెఎల్ రాహుల్, సాహా, అభిమన్యు ఈశ్వరన్, సూర్యకుమార్ యాదవ్
undefined
click me!