నీకు వచ్చింది కరోనా కాదు, ఇది వేరే... అంతకంటే ప్రమాదకరం... నెటిజన్‌కి హనుమ విహారి స్ట్రాంగ్ కౌంటర్...

First Published May 13, 2021, 4:51 PM IST

తెలుగు క్రికెటర్, టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ హనుమ విహారి బ్యాటింగ్ స్ట్రైల్ చూడడానికి ఎంత క్లాస్‌గా ఉంటుందో, అతన్ని ట్రోల్ చేయాలని చూసినవారికి అతను ఇచ్చే రిప్లై అంతే క్లాస్‌గా ఉంటాయి. సిడ్నీలో టెస్టులో తన ఇన్నింగ్స్‌ను విమర్శించిన మంత్రికి, ఎంతో హుందాగా కౌంటర్ ఇచ్చిన విహారి, మరోసారి ఓ నెటిజన్‌కి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

వరుసగా రెండో సీజన్‌లోనూ హనుమ విహారికి ఐపీఎల్ ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడుతున్న హనుమ విహారి, మొదటి మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇప్పటిదాకా బ్యాటుతో పెద్దగా రాణించకపోయినా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముందు కావాల్సినంత ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు.
undefined
ఓ పక్క కౌంటీ మ్యాచులతో బిజీగా ఉంటూనే ఇండియాలో కోవిద్ 19 సెకండ్ వేవ్‌తో బాధపడుతున్నవారికి తనవంతు సాయం చేస్తున్నాడు హనుమ విహారి. హైదరాబాద్‌లో కరోనాతో బాధపడుతున్న ఓ కుటుంబానికి తనవంతుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశాడు విహారి.
undefined
అలాగే కరోనా బాధితుల కోసం సోషల్ మీడియా వేదికగా విరాళాలు సేకరిస్తున్నాడు. ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే నిర్మొహమాటంగా అడగాలంటూ ట్వీట్ చేశాడు హనుమ విహారి. దీనికి ఓ తుంటరి నెటిజన్, తలతిక్క రిప్లై ఇచ్చాడు.
undefined
‘సరే 2 మసాలా దోశా తీసుకొని రా భయ్యా... ఇంకా కొబ్బరి చట్నీ కూడా తీసుకుని రా...’ అంటూ కామెంట్ చేశాడు నెటిజన్. దీనికి సమాధానం ఇచ్చిన విహారి... ‘నువ్వు నిజంగా దేశంలోని చాలామంది ప్రజలలాగే కరోనాతో ఇబ్బంది పడుతుంటే, నేను కచ్ఛితంగా తీసుకువస్తాను. ఓ... ఆగు ఓ నిమిషం నిజానికి నీకు వచ్చింది అది, కాదు ఇదే వేరే రోగం. ఐ యామ్ సారీ’ అంటూ రిప్లై ఇచ్చాడు.
undefined
హనుమ విహారి కౌంటర్ రిప్లైకి బెదిరిపోయిన సదరు నెటిజన్, వెంటనే తన కామెంట్‌ను డిలీట్ చేసేశాడు. సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి, ఆ మ్యాచ్‌లో గాయంతో బాధపడుతూనే 50 ఓవర్లకి పైగా బ్యాటింగ్ కొనసాగించాడు...
undefined
click me!