ఈ క్రికెటర్లకి ఏమైంది... మొన్న సురేష్ రైనా, నేడు రవీంద్ర జడేజా...

Published : Jul 23, 2021, 04:48 PM IST

క్రికెట్‌లో మతాలకు, కులాలకు చోటు లేదు. కులమతాలకు సంబంధం లేకుండా అభిమానించేది క్రికెటర్లను మాత్రమే అని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు భారత క్రికెట్‌లో కూడా కుల కుంపటి రాజుకునేలా కనిపిస్తోంది. మొన్న సురేష్ రైనా ‘నేను బ్రహ్మాణుడినే’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కాగా, ఇప్పుడీ లిస్టులో రవీంద్ర జడేజా కూడా చేరాడు...

PREV
16
ఈ క్రికెటర్లకి ఏమైంది... మొన్న సురేష్ రైనా, నేడు రవీంద్ర జడేజా...

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) ప్రారంభ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సురేష్ రైనా, తమిళనాడుతో, చెన్నైతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ ‘నేను బ్రహ్మాణుడినే’ అంటూ కుల ప్రస్తావన చేశాడు.

26

ఓ నగరంతో ఉన్న అనుబంధం గురించి చెప్పడానికి కులం గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నెటిజన్లు. అయితే రైనా అభిమానులు మాత్రం అతనికి అండగా నిలిచారు.

36

సురేష్ రైనా చేసిన వ్యాఖ్యల తర్వాత అతన్ని తీవ్రంగా విమర్శిస్తూ పోస్టులు చేసినవారే కాకుండా సోషల్ మీడియాలో ‘ఐ యామ్ బ్రాహ్మీణ్...’ అంటూ, ‘ఐ సపోర్ట్ రైనా’ అంటూ అతనికి సపోర్ట్ చేస్తూ హ్యా‌ష్‌ట్యాగ్స్ ట్రెండ్ చేసిన వాళ్లూ ఉన్నారు...

46

రైనాపై వస్తున్న ట్రోలింగ్‌ను గమనించిన సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కులప్రస్తావన చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ‘రాజ్‌పుత్ ఫర్‌ఎవర్, జై హింద్’ అంటూ ట్వీట్ చేశాడు జడేజా. ఈ ట్వీట్‌తో మరోసారి కులచిచ్చు రాజుకుంది. 

56

తాను రాజ్‌పుత్‌నని, అందుకు గర్వపడుతున్నానని చెబుతూ ట్వీట్ చేయడం.. కులాహంకారానికి ప్రతీక అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. తన టీమ్‌మేట్‌కి సపోర్ట్ చేయాలని ఇలా చేసినా, అతను కులం గురించి కాకుండా, ‘ఇండియన్ ఫస్ట్’ అంటూ చెప్పాల్సిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

66

సురేష్ రైనా, రవీంద్ర జడేజాల ట్వీట్ల కారణంగా భారత జట్టులో ఉన్న ప్లేయర్ల కులాల గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. క్రికెట్‌లోనూ అగ్రవర్ణాల అధిపత్యమే ఉందంటూ... కులాల ప్రస్తావన వచ్చి, అనవసర రచ్చ మొదలైంది.

click me!

Recommended Stories