ఓపెనర్‌గా ఛతేశ్వర్ పూజారా... రాణించిన జడేజా, మయాంక్, హనుమ విహారి...

First Published Jul 23, 2021, 3:04 PM IST

ఇంగ్లాండ్ సిరీస్ ఆరంభానికి ముందు కౌంటీ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆకట్టుకున్నారు. కెఎల్ రాహుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకోగా, రవీంద్ర జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు...

తొలి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ సెంచరీ, రవీంద్ర జడేజా 75 పరుగులు చేయడంతో 311 పరుగులు చేసింది భారత జట్టు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు.
undefined
భారత బౌలర్లు అదరగొట్టడంతో కౌంటీ సెలక్టర్ ఎలెవన్ 220 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ హసీబ్ హమీద్ 112 పరుగులు చేయగా ప్యాటిర్సన్ వైట్ 33 పరుగులు చేశాడు...
undefined
భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు. బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.
undefined
రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కి రాకపోవడంతో అతని స్థానంలో ఛతేశ్వర్ పూజారా ఓపెనర్‌గా రావడం విశేషం. తొలి వికెట్‌కి పూజారా, మయాంక్ అగర్వాల్ కలిసి 87 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
undefined
తన స్టైల్‌కి విరుద్ధంగా దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఛతేశ్వర్ పూజారా 58 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
undefined
మయాంక్ అగర్వాల్ 81 బంతుల్లో 7 ఫోర్లతో 47 పరుగులు చేసి అవుట్ కాగా రవీంద్ర జడేజా 77 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన హనుమ విహారి 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
undefined
55 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసిన భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, 15.5 ఓవర్లు బ్యాటింగ్ చేసిన కౌంటీ ఎలెవన్ వికెట్లేమీ కోల్పోకుండా 31 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
undefined
click me!