41 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా... అయినా ఆ ఇద్దరికీ దక్కని చోటు...

First Published Jul 23, 2021, 4:14 PM IST

శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు, రికార్డు స్థాయిలో ఐదుగురు కొత్త కుర్రాళ్లతో బరిలో దిగిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులు చేయని టీమిండియా, బౌలింగ్‌లో పూర్తిగా కొత్త బౌలర్లతో బరిలో దిగింది.

టీమిండియా తరుపున సంజూ శాంసన్, రాహుల్ చాహార్, నితీశ్ రాణా, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా వన్డేల్లో ఆరంగ్రేటం చేశారు. ఒకే మ్యాచ్‌లో ఐదుగురు కొత్త ప్లేయర్లతో బరిలో దిగడం భారత జట్టుకి ఇది రెండోసారి.
undefined
ఇంతకుముందు 1980లో మెల్‌బోర్న్‌లో జరిగిన వన్డేలో భారత జట్టు ఐదుగురు కొత్త ప్లేయర్లతో ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా, ఆస్ట్రేలియాపై 66 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం.
undefined
1974లో ఇంగ్లాండ్‌పై మొట్టమొదటి వన్డే మ్యాచ్ ఆడిన టీమిండియా... 11 మంది ప్లేయర్లతో ఆరంగ్రేటం చేశారు. ఆ తర్వాత 1980లో జరిగిన వన్డేలో దిలీప్ జోషీ, క్రితి అజాద్, రోజర్ బిన్నీ, సందీప్ పాటిల్, తిరుమలై శ్రీనివాసన్ ఎంట్రీ ఇచ్చారు.
undefined
2015లో జింబాబ్వేపై టీ20ల్లో భారత జట్టు తరుపున ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, వన్డే ఆరంగ్రేటం చేయడానికి ఆరేళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. 2196 రోజుల తర్వాత వన్డే ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్ ఈ ఫీట్ సాధించిన మొదటి ప్లేయర్‌గా నిలిచాడు.
undefined
ఐదుగురు కొత్త కుర్రాళ్లకు టీమ్‌లో చోటు దక్కినా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు చోటు దక్కకపోవడంపై అభిమానులు నిరాశకు గురవుతున్నారు...
undefined
నితీశ్ రాణాకి మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసిన అనుభవం ఉండడం వల్ల అతనికి అవకాశం ఇచ్చిన టీమిండియా, గత వన్డేలో జరిగిన బ్యాటింగ్ పరాభవం కారణంగా కీలక బ్యాట్స్‌మెన్‌ను తప్పించే సాహసం చేయలేదని తెలుస్తోంది.
undefined
ఐపీఎల్ 2020 సీజన్‌లో కేవలం ఓ నెట్‌బౌలర్‌గా ఉన్న చేతన్ సకారియా, ఐపీఎల్ 2021 సీజన్‌ వేలంలో సకారియాను రాజస్థాన్ రాయల్స్ రూ.కోటి 20 లక్షలకు కొనుగోలు చేయడంతో అతని కెరీర్ పూర్తిగా మారిపోయింది.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీని క్లీన్‌బౌల్డ్ చేసిన చేతన్ సకారియా, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్‌మెన్లను అవుట్ చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌కి ముందు తమ్ముడి ఆత్మహత్య చేసుకోగా, లీగ్ ముగిసిన తర్వాత కరోనాతో సకారియా తండ్రి ప్రాణాలు కోల్పోయారు. ఆ రెండు విషాదాల నుంచి త్వరగానే కోలుకున్నాడు సకారియా.
undefined
ఐపీఎల్‌ 2021 వేలంలో రూ.9కోట్ల 25 లక్షల భారీ ధర దక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించిన కృష్ణప్ప గౌతమ్‌ కూడా నేటి మ్యాచ్ ద్వారా ఆరంగ్రేటం చేయనున్నాడు. భారీ ధర పెట్టి కొనుగోలు చేసినా కృష్ణప్ప గౌతమ్‌ను మొదటి ఏడు మ్యాచుల్లో ఆడించనేలేదు సీఎస్‌కే...
undefined
click me!