రంజీ ట్రోఫీలో మెరిసిన ఐపీఎల్ హీరోలు... రజత్ పటిదార్, కుమార కార్తీకేయ, సర్ఫరాజ్ ఖాన్...

First Published Jun 26, 2022, 6:44 PM IST

ఐపీఎల్ కారణంగా రంజీ ట్రోఫీ 2022 సీజన్‌ని రెండు విడతలుగా నిర్వహించింది బీసీసీఐ. మార్చి నెలలో ఫస్ట్ ఫేజ్ జరగగా, ఐపీఎల్ తర్వాత జూన్‌లో నాకౌట్ మ్యాచులు జరిగాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆకట్టుకున్న ప్లేయర్లలో చాలా మంది, రంజీ ట్రోఫీలోనూ మంచి పర్పామెన్స్ కనబర్చారు... 130 రోజుల పాటు సాగిన రంజీ ట్రోఫీలో 65 మ్యాచులు జరిగాయి. వీటిల్లో ది బెస్ట్ పర్పామెన్స్ ఇచ్చిన ప్లేయర్లు వీరే...

Image credit: BCCI

రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో 6 మ్యాచుల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు సర్ఫారాజ్ ఖాన్. ఇందులో 19 సిక్సర్లు, 93 ఫోర్లు ఉన్నాయి. నాలుగు సెంచరీలు చేసిన సర్ఫరాజ్ ఖాన్, ఈ సీజన్‌లో 700+ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు... ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన సర్ఫరాజ్ ఖాన్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు...

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడి, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రజత్ పటిదార్, రంజీ ట్రోఫీలోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. 6 మ్యాచుల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 82.25 సగటుతో 658 పరుగులు చేసిన రజత్ పటిదార్, 100 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు...

ఐపీఎల్‌లో అమ్ముడుపోని నాగాలాండ్ క్రికెటర్ చేతన్ బిస్త్, రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో 5 సెంచరీలతో 623 పరుగులు చేయగా మెగా వేలంలో ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించలేకపోయిన యష్ దూబే 614, శుబ్‌మన్ శర్మ 608 పరుగులు చేశారు...

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో కరోనా బారిన పడిన అక్షర్ పటేల్ స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరిన శామ్స్ ములానీ, రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో 45 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2022 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన కుమార్ కార్తీకేయ, 32 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు...

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడిన షాబజ్ నదీం 25 వికెట్లు తీయగా వేలంలో షార్ట్ లిస్ట్‌లో ప్లేస్ కూడా దక్కించుకోలేకపోయిన గౌరవ్ యాదవ్, ఎస్‌ఎస్ బచ్చవ్ 21 వికెట్లు తీశారు... 

Image credit: PTI

బీహార్ ప్లేయర్ సకీబుల్ గనీ, మిజోరంతో జరిగిన మ్యాచ్‌లో 341 పరుగులు చేసి, సీజన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ బ్యాటర్ యష్ దూబే 289 పరుగులు చేయగా సిక్కిం బ్యాటర్ క్రాంతి కుమార్, బీహార్‌తో మ్యాచ్‌లో 287 పరుగులు చేశాడు.. 

Image credit: BCCI

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన షారుక్ ఖాన్, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదగా, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ లలిత్ యాదవ్, తమిళనాడుపై 10 సిక్సర్లు బాదాడు. లక్నో ప్లేయర్ మనీశ్ పాండే, రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాది టాప్‌లో నిలిచారు...
 

మధ్యప్రదేశ్ ప్లేయర్ రజత్ పటిదార్, ఈ సీజన్‌లో 100 సిక్సర్లు బాది టాప్‌లో నిలవగా బీహార్ ప్లేయర్ సకీబుల్ గనీ 97 ఫోర్లు, ముంబై పాకెట్ డైనమేట్ సర్ఫరాజ్ ఖాన్ 93 ఫోర్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు...  

click me!