35 ఏళ్లల్లో మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్... కపిల్ దేవ్ మ్యాజిక్‌ని జస్ప్రిత్ బుమ్రా రిపీట్ చేయగలడా...

Published : Jun 26, 2022, 03:35 PM IST

ఐదో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలడంతో భారత జట్టును నడిపించే సారథి ఎవరు? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మ్యాచ్ ఆరంభానికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉండడంతో రోహిత్ శర్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని, జట్టుకి అందుబాటులో రావడం కష్టమేనని భావిస్తోంది బీసీసీఐ...

PREV
17
35 ఏళ్లల్లో మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్... కపిల్ దేవ్ మ్యాజిక్‌ని జస్ప్రిత్ బుమ్రా రిపీట్ చేయగలడా...

ఒకవేళ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకోకపోతే, నిబంధనల ప్రకారం ఐదో టెస్టుకి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా... టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది... ఇదే జరిగితే గత 35 ఏళ్లల్లో టీమిండియాని నడిపించే మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్‌గా నిలుస్తాడు బుమ్రా...

27

ఇంతకుముందు భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, టీమిండియాకి సారథిగా వ్యవహరించాడు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచి, సరికొత్త చరిత్ర లిఖించింది భారత జట్టు...

37
Jasprit Bumrah

కపిల్ దేవ్ తర్వాత మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, కెఎల్ రాహుల్ వంటి బ్యాటర్లు టీమిండియాని నడిపించారు. మధ్యలో స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే, టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించాడు...

47

జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటే 2022లో టీమిండియా కెప్టెన్‌గా మారిన ఆరో ప్లేయర్‌గా నిలుస్తాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా.. ఈ ఏడాది భారత కెప్టెన్లుగా వ్యవహరించారు. ఒకే ఏడాదిలో ఆరుగురు కెప్టెన్లు మారడం టీమిండియా చరిత్రలో ఇదే తొలిసారి...

57

సౌతాఫ్రికా టూర్‌లో జరిగిన వన్డే సిరీస్‌కి జస్ప్రిత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో జరిగిన ఈ సిరీస్‌లో భారత జట్టు ఒక్క వన్డే మ్యాచ్ కూడా గెలవలేక ప్రత్యర్థి చేతుల్లో వైట్ వాష్ అయ్యింది...

67

టీమిండియా తరుపున 29 టెస్టులు, 68 వన్డేలు, 57 టీ20 మ్యాచులు ఆడిన జస్ప్రిత్ బుమ్రా, ఓవరాల్‌గా 300 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం బుమ్రాకి ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుంది...

77
Image Credit: Getty Images

ప్రస్తుతం ఆస్ట్రేలియాకి టెస్టుల్లో ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కమ్మిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టును యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో చిత్తు చేసింది... బుమ్రా ఈ రికార్డును రిపీట్ చేయగలడా? అనేది చూడాలి..

Read more Photos on
click me!

Recommended Stories